భూగర్భ జలాల పథకం స్కీంలలో ఐదో స్థానంలో తెలంగాణ

Telangana is at the fifth place in the ground water scheme schemes– మైనర్‌ ఇరిగేషన్‌ స్కీం లపై ఆరో గణన రిపోర్ట్‌ రిలీజ్‌ చేసిన కేంద్ర జలశక్తి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో భూగర్భ జలాల(గ్రౌండ్‌ వాటర్‌, జీడబ్ల్యూ) స్కీంలలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. అలాగే ఉపరితల జలాల (సర్ఫేస్‌ వాటర్‌) స్కీంలలో మూడో స్థానంలో చోటు సంపాదించు కుంది. చిన్న నీటి పారుదల(మైనర్‌ ఇరిగేషన్‌) పథకాలకు సంబంధించిన ఆరవ గణనను రిపోర్ట ను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ శనివారం రిలీజ్‌ చేసింది. ఈ రిపోర్ట్‌ లో దేశ వ్యాప్తంగా మొత్తం 2.31 కోట్ల చిన్న నీటి పారుదల పథకాలు ఉన్నట్లు పేర్కొంది. ఇందులో 2.19 కోట్లు (94.8శాతం) గ్రౌండ్‌ వాటర్‌, 10.21 లక్షల(5.2శాతం) ఉపరితల జలాల స్కీంలు ఉన్నట్టు వెల్లడించింది. కాగా దేశంలో అత్యధిక మైనర్‌ ఇరిగేషన్‌ స్కీం లు ఉన్న రాష్ట్రంగా యూపీ ఉందని రిపోర్ట్‌ లో పేర్కొంది. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ లు ఉన్నట్టు తెలిపింది. అలాగే ఉపరితల జలాల స్కీం లలో మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్‌ లు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. గ్రౌండ్‌ వాటర్‌ స్కీంలలో బావులు, చేతి బోర్‌ లు, మధ్యస్థ బోర్‌ లు, లోతైన బోర్లు… ఉపరితల జలాల స్కీంలో ప్రవాహ, లిఫ్ట్‌ స్కీంలను పరిగణలోకి తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. బోర్లు, బావులు వంటివి అయిన మైనర్‌ ఇరిగేషన్‌ స్కీంలు 96.6 శాతం ప్రయివేటు వ్యక్తుల చేతిలోనే ఉన్నాయని వివరించింది. కాగా తొలిసారి గ్రౌండ్‌ వాటర్‌ స్కీంలలో జెండర్‌ రేషియోలో గణన చేసినట్టు తెలిపింది. ఇందులో 60.2శాతం పురుషులు, 18.1 శాతం మహిళల పేరుతో ఉన్నట్లు స్పష్టం చేసింది.
తెలంగాణలో గ్రౌండ్‌ వాటర్‌ స్కీంలు తగ్గాయి
మైనర్‌ ఇగిరేషన్‌ స్కీంలకు సంబంధించి 5 వ రిపోర్ట్‌ (2017%ు%18) తో పోల్చితో గ్రౌండ్‌ వాటర్‌ స్కీంలు 1, 23, 094, ఉపరితల జలాల స్కీంలు 34, 482 కు పెరిగినట్లు పేర్కొంది. అలాగే గ్రౌండ్‌ వాటర్‌ స్కీంలు తెలంగాణలో తగ్గుముఖం పట్టినట్లు పేర్కొంది. ఐదవ రిపోర్ట్‌ లో 95.7 శాతంగా ఉన్న గ్రౌండ్‌ వాటర్‌ స్కీంలు… 6 వ రిపోర్ట్‌ లో 94 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. ఇదే సందర్భంలో ఉపరితల జలాల స్కీంలు 4.3 శాతం నుంచి 6 శాతానికి పెరిగినట్లు పేర్కొంది. అంటే బావులు, బోర్ల పై ఆధారపడే వారి సంఖ్య తగ్గి, ప్రవాహం, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పై ఆధారపడే ప్రజల సంఖ్య పెరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్‌ ఇచ్చిందని తెలిపింది. ప్రస్తుత రిపోర్ట్‌ ప్రకారం…. తెలంగాణ లో 4, 57, 784 బావులు, 76, 790 చేతి బోర్లు, 6, 77, 156 మధ్యస్థ బోర్‌ బావులు, 3, 67,519 లోతైన బోర్లు, 62, 753 ఉపరితల ప్రవాహాలు, 37, 866 ఉపరితలం నుంచి లిఫ్ట్‌ చేసే పథకాలు ఉన్నట్లు వివరించింది. అలాగే గ్రౌండ్‌ వాటర్‌ స్కీంలలో 99 శాతం వ్యక్తిగత, ఉపరితల జలాల స్కీంలో 45. 1శాతం వ్యక్తిగత, 2.5 శాతం రైతలు సమూహం, 52.4 శాతం పబ్లిక్‌ యాజమాన్యం కలిగినవిగా ఉన్నట్లు పేర్కొంది.