కుత్బుల్లాపూర్‌లో అట్టహాసంగా ‘తెలంగాణ రన్‌’

ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌,
సీపీ స్టీఫెన్‌ రవీంద్ర
 హుషారెత్తించిన సినీ నటులు విశ్వక్‌ సేన్‌,
అశ్విన్‌ , నటి నందిత శ్వేత
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్‌
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ”తెలంగాణ రన్‌”అట్టహాసంగా జరిగింది. ఈ రన్‌ కి ముఖ్య అతిథులుగా హాజరైన కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర , అడిషనల్‌ కలెక్టర్‌ అభిషేక్‌ అగస్త్య , జోనల్‌ కమిషనర్‌ మమత, నిజాంపేట్‌ మేయర్‌ కోలన్‌ నీలా గోపాల్‌ రెడ్డి తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రముఖ సినీ నటులు విశ్వక్‌ సేన్‌ , అశ్విన్‌, నటి నందిత శ్వేత తెలంగాణ రన్‌ లో పాల్గొని హుషారెత్తించారు. కుత్బులపూర్‌ మున్సిపల్‌ గ్రౌండ్‌ నుండి చింతల్‌ బస్‌ స్టాప్‌ మీదుగా ఐడీపీఎల్‌ నుండి తిరిగి మునిసిపల్‌ గ్రౌండ్‌ వరకు సాగింది. ఈ రున్‌ లో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు చంద్రశేఖర్‌ రెడ్డి, వెంకట్‌ రెడ్డి, గంగారాం, రామలింగరాజు , డీసీలు మంగతాయారు, ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ యూత్‌ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు, యువత పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.