– రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్‌రావు
నవ తెలంగాణ నర్సాపూర్
పది సంవత్సరాల క్రితం రైతులకు ఎరువులు, విత్తనాలు కావాలంటే చెప్పులను క్యూలో ఉంచి నంబర్ వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చిట్టీ తీసుకుని ఎరువులు తెచ్చుకున్నారని, గతంలో ఎట్లుండే.. ఇప్పుడేట్ల ఉందో గమనించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ మణికొండ రఘునం దన్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రెండో రోజు నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకలలో మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని గోమారం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతువేదిక ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రాజర్శి షా మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కొంత మార్పులు చేసి అన్ని రాష్ట్రాలలో కొనసాగిస్తోం దన్నారు. అనంతరం పంటల క్యాలెండర్‌ను అధికారు లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షులు, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, పీఎసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ చారి, ఉపతహసీల్దార్ ప్రభుదాస్, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్, సర్పంచులు లావణ్య మాధవరెడ్డి, ఆలేటి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు అశోక్ రెడ్డి, చిట్యాల లక్ష్మీ బాలపోచయ్య, ఏనుగు సుధాకర్ రెడ్డి, బోల్ల భారతి బిక్షపతి, ఎంపీటీసీ నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్ కాముని శ్రీనివాస్ పాల్గొన్నారు.
నవతెలంగాణ-చేగుంట: రైతులకు నాణ్యమైన విత్తనాలు హైదరాబాదులోని రాజేంద్రనగర్ నుంచి సరఫరా చేస్తున్నామని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. చేగుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధ్యక్షతన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జడ్పిటిసి శ్రీనివాస్, సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ లు అయిత వెంకటలక్ష్మి, మేండే శోభ, భక్కి లక్ష్మీ రమేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు వెంగళరావు, సర్పంచులు నిర్మల సత్యం, మార్కెట్ కమిటీ సెక్రటరీ మధురిక, ఈశ్వర్, వ్యవసాయ విస్తరణ అధికారి మాధవి, సిద్ధిరాములు పాల్గొన్నారు.
నవతెలంగాణ ములుగు: మండల పరిధిలోని ములుగులో రైతువేదికలలో నిర్వహించిన తెలంగాణ రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఏఎంసీ చైర్మన్ ఎండి జహంగీర్ పిఎసిఎస్ చైర్మన్ బట్టు అంజిరెడ్డి రాష్ట్ర యువత విభాగం అధ్యక్షుడు జుబేర్ పాషా, మొలుగు తాహసిల్దార్ ప్రవీణ్ రెడ్డి లు హాజరయ్యారు. ఏఎంసీ చైర్మన్ జహంగీర్ పిఎసిఎస్ చైర్మన్ అంజి రెడ్డి, సమన్వయ అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఏఎంసి వైస్ చైర్మన్ కోడూరు భూపాల్ రెడ్డి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు లింగారెడ్డి ఎంపిటిసి హరిబాబు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గంగిశెట్టి గణేష్ గుప్తా పాల్గొన్నారు.
నవ తెలంగాణ దుబ్బాక/దుబ్బాక రూరల్: తెలం గాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను మండల పరిధిలోని గంభీర్ పూర్ రైతు వేదికలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. క్లస్టర్ పరిధిలోని శిలాజినగర్, వెంకటగిరి తండా, పోతారం, గంభీర్ పూర్ సర్పంచ్లు మాడూరి శ్రీనివాస్, పాతులోత్ పెంటమ్మ బాలకిషన్, గడీల జనార్ధన్ రెడ్డి, కరికే భాస్కర్ లతో కలిసి ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి అధ్యక్షతన ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ పంచాయతీరాజ్ ఏఈ రిజ్వాన్ రైతుల పట్ల ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సంక్షేమ పథకాలను రైతులకు వివరించారు. రైతు సమన్వయ సమితి నీరటి నర్సింలు, ఏఈఓ, పంచాయతీ కార్యదర్శులు వజ్ర, చంద్రం పాల్గొన్నారు.
నవతెలంగాణ ములుగు: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రైతు దినోత్సవాన్ని స్థానిక కొండ లక్ష్మణ్ తెలంగాణ విశ్వవిద్యాలయం ములుగులోని పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. డీన్ ఆఫ్ హార్టికల్చర్ డాక్టర్ కిరణ్ కుమార్ హాజరయ్యారు. డి వీరప్రసాద్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనారాయణ డాక్టర్ మల్లేష్ సింధుజ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
నవతెలంగాణ రాయపోల్: స్వరాష్ట్రలో ముఖ్యమం త్రి కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎంపీపీ కల్లూరు అనిత శ్రీనివాస్, జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, ఏఎంసి చైర్ పర్సన్ ఇప్ప లక్ష్మి, రైతుబంధు మండలాధ్యక్షుడు మున్న అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాయపోల్, మంతూర్, ఆరేపల్లి వడ్డేపల్లి క్లస్టర్ రైతు వేదికలలో రైతు దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మున్నయ్య, ఏపీఎం దుర్గాప్రసాద్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి, టిఆర్‌ఎస్ మండల అధక్షుడు వెంకటేశ్వర శర్మ, కో ఆప్షన్ సభ్యులు పర్వేజ్, ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు లక్ష్మణ పాల్గొన్నారు.
నవతెలంగాణ-తొగుట: రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు మళ్లించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని రైతు బంధు మండల అధ్యక్షుడు బోధనం కనకయ్య అన్నారు. శని వారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మండల కేంద్రం నుండి రైతు వేదిక వర కు క్లస్టర్ పరిధిలోని సర్పంచ్‌లు, రైతులు, అధికారుల తో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ పాగాల కొండల్ రెడ్డి, మంగ రేణుకా నర్సింలు,ఎం.ప్రేమల చంద్రా రెడ్డి, అప్పనపల్లి శ్యామల ఆంజనేయులు ఎంపీటీసీ సూతరి లలిత రమేష్,ఇంచార్జ్ ఎంపీడీ వో శ్రీనివాస్ పాల్గొన్నారు.
నవతెలంగాణ దుబ్బాక/దుబ్బాక రూరల్: రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం అక్బర్ పేట-భూంపల్లి మండల పరిధిలోని పోతారెడ్డిపేట రైతు వేదికలో రైతు దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. క్లస్టర్ పరిధిలోని చిన్న నిజాంపేట, రామేశ్వరంపల్లి, తాళ్లపల్లి, నగరం, పోతారెడ్డిపేట గ్రామాల సర్పంచ్లు షేర్ల రచన కైలాష్, ఆరుట్ల స్వరూప,పల్లె సుగుణ, పుట్లగారి శంకరయ్య,ఉప సర్పంచ్ రవి చారి, ఏఎంసీ చైర్ పర్సన్ చింతల జ్యోతి కృష్ణ,ఎంపీటీసీల ఫోరం దుబ్బాక మండలాధ్యక్షుడు మంద చంద్రసాగర్, స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో భాస్కర శర్మ, ఏఈవో అనూష, పంచాయతీ కార్యదర్శులు హరీష్, మల్లేశం మాట్లాడారు. ఏఎంసి డైరెక్టర్ దేవరాజు,బిఆర్‌ఎస్ అక్బర్ పేట-భూంపల్లి మండలాధ్యక్షుడు జీడిపల్లి రవి,ఎర్రోళ్ల రాజు పాల్గొన్నారు.
నవతెలంగాణ దుబ్బాక రూరల్ : రైతు హితమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తిమ్మాపూర్ ఎంపీటీసీ రామవరం మాధవి చంద్రశేఖర్ రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ చింతల జ్యోతి అన్నారు.
శనివారం మండలంలోని తిమ్మాపూర్ రైతు వేదికలో జరిగిన రైతు దినోత్సవ వేడుకల్లో వారు మాట్లాడారు. ఏఎంసీ చైర్పర్సన్ చింతల జ్యోతి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు. క్లస్టర్ పరిధిలోని తిమ్మాపూర్, పద్మనాభునిపల్లి, అప్పనపల్లి, హసన్ మీరాపూర్ రైతులు, ఏవో ప్రవీణ్ కుమార్ ,ఏఈవో చైతన్య పాల్గొన్నారు.
నవతెలంగాణ-తొగుట: తెలంగాణ రైతు సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారం పెద్దామాసాన్‌పల్లి క్లస్టర్ పరిధిలోని రైతు వేదికలో తె లంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ లు మెట్టు వరలక్ష్మి స్వామి, కుంభం శారద రగోత్తం రెడ్డి,సిరినేని గోవర్ధన్ రెడ్డి, ఎంపీటీసీలు వేల్పుల స్వామి, మష్టి సుమలత కనకయ్య, ఎపిఎం ముగ్దుమ్ అలీ,ఎఎంసి డైరెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి,పిఏసీఎస్ డైరెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు.
నవతెలంగాణ-కోహెడ: రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా శనివారం రైతులు, కార్మికులతో కలిసి మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాలలో రైతు వేధికల వద్ద సహాపంక్తి భోజనాలు చేశారు. బస్వాపూర్ గ్రామం లో ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్, మండల కేంద్రంలో ఫ్యాక్స్ ఛైర్మన్ పెర్యాల దెవేందర్‌రావు మాట్లాడారు. రైతుబంధు మండల అధ్యక్షుడు పెర్యాల రాజేశ్వర్‌రావు, సర్పంచ్‌లు ఎడబోయిన సత్తయ్య, తైదల రవీందర్, సంపతి తిరుపతిరెడ్డి, కన్నం లక్ష్మిరాజు, లావుడ్య సరోజనదెవేందర్, ఎంపీటీసీ కొడముంజ మల్లవ్వ రాజు, మండల వ్యవసాయ అధికారి భోగేశ్వర్, ఏఈవో కీర్తిన, నాగసముద్రాల ఉపసర్పంచ్ చామంతుల లత పాల్గొన్నారు.
నవ తెలంగాణ-దౌల్తాబాద్ : దశాబ్ది ఉత్సవాల పేరుతో గ్రామాల్లోకి వెళ్లాలని సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండల వ్యాప్తంగా దౌల్తాబాద్, తిర్మలాపూర్, ముబారాస్ పూర్, దొమ్మాట క్లస్టర్లలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. దౌల్తాబాద్ క్లస్టర్లో జెడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రహీమొద్దీన్, వైస్ ఎంపీపీ అల్లి శేఖర్ రెడ్డి, తిర్మలాపూర్ క్లస్టర్లో ఏఎంసీ చైర్పర్సన్ ఇప్ప లక్ష్మీ, పీఏసీఎస్ ఛైర్మన్ వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్, ముబారాస్ పూర్ క్లస్టర్లో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు తుమ్మ స్టీవెన్ రెడ్డి, దొమ్మాట క్లస్టర్లో ఎంపీపీ గంగాధరి సంధ్య హాజరయ్యారు. బీఆర్‌ఎస్ పాలనలో వ్యవసాయరంగంలో చేసిన అభివృద్ధి, రైతు సంక్షేమ పథకాలను వివరించారు.
నవతెలంగాణ-గుమ్మడిదల
‘ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడవు’ అని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. అత్యాధునిక పరికరాలతో కూరగాయ, వ్యవసాయ పంటలు పండించడం గుమ్మడిదల రైతులతోనే సాధ్యపడు తుందని వారిని అభినందించారు. గుమ్మడిదల మండల కేంద్రంతోపాటు కానుకుంట క్లస్టర్ వ్యవసా య శాఖ ఆధ్వర్యంలో రైతు వేదిక వద్ద శనివారం ఏర్పాటు చేసిన దశాబ్ది ఉత్సవాలల్లో ఎమ్మెల్యే పాల్గొని మట్లాడారు. రాష్ట్రం ఏర్పడక ముందు.. ప్రస్తుతం ఉన్న అభివృద్ధిని ప్రజలు పరిశీలించాల న్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా, రైతుబంధు, ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ తాగునీరు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఎన్నో పథకాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ జిల్లా అధికారి శ్రీనివాస్ రావు, దశాబ్డి ఉత్సవాల ప్రత్యేక జిల్లా అధికారి అరుణ్ కుమార్, పటాన్చెరువు మార్కెట్ కమిటీ చైర్మన్ విజరు కుమార్, నియోజకవర్గం ఆత్మ చైర్మన్ గడీల కుమార్ గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసి కుమార్ గౌడ్, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు నక్క మంజుల వెంకటేష్ గౌడ్, మండల రైతుబంధు కోఆర్డినేటర్ పి సంజీవరెడ్డి, డీఏవో జి నరసింహారావు సంగారెడ్డి, ఏడిఏ పటాన్చెరు బి జె సురేష్, సర్పంచ్ బేకు నీలమ్మ, చిమ్ముల నరసింహారెడ్డి, ఎంపీటీసీ కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి,బుద్దుల పార్వతమ్మ, సర్పంచులు, తహసీల్దార్, ఎంపీడీఓ, పలు శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.