దేశానికి ఆదర్శంగా తెలంగాణ పథకాలు

– చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-శంకర్‌పల్లి
దేశానికి ఆదర్శంగా తెలంగాణ పథకాలు నిలుస్తాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లి మండలంలోని బుల్కాపూర్‌, ప్రొద్దుటూరు గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత చేపల పంపిణీలో ఆదివారం లక్షా చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో చేయని సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతోందన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా మైనార్టీలకు కూడా లక్షా రూపాయలు అందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవింద మ్మగోపాల్‌ రెడ్డి, పొద్దుటూరు గ్రామ సర్పంచ్‌ ఏనుగు నరసింహారెడ్డి, ఎంపీటీసీ ప్రవళిక వెంకట్‌రెడ్డి, బుల్కాపూర్‌ కౌన్సిలర్‌ లక్ష్మమ్మ రాంరెడ్డి, శంకర్పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాపారావు, సింగిల్‌ విండో చైర్మన్‌ బద్దం శశిధర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కావలి గోపాల్‌, మున్సిపల్‌ అధ్యక్షుడు వాసుదేవ్‌, రాఘవేందర ్‌రెడ్డి, ఎంపీటీసీ యాదగిరి, మాణిక్యరెడ్డి, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.