తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కార్మికుల మేనిఫెస్టో 

– రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీల తమ అభిప్రాయాలను చెప్పాలని డిమాండ్ 
నవతెలంగాణ- కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కార్మికుల మెనీ పేస్తో కు సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు వివిధ పార్టీల తమ సంఘాల అభిప్రాయలను చెప్పాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సిఐటియు కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో 2023 నవంబర్ 30న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రంగాల్లోని కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని, అందుకు వివిధ రాజీకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాలని కోరుతూ నిజామాబాద్ జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ (తేది: 21-10-2023) సమావేశాన్ని నిర్వహించాం. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కార్మిక, ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు తెలంగాణలో కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను సమగ్రంగా చర్చిండం జరిగింది.కార్మికవర్గం రాష్ట్రంలో ఉత్పాదకతను పెంచడంలోనూ, వివిధ సేవా రంగాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వారు చేస్తున్న కృషిని అధికార పార్టీ మరియు వివిధ రాజకీయ పార్టీలు గుర్తించాలని, ఎన్నికలకు ముందు తమ మేనిఫెస్టోల్లో కార్మికుల సమస్యలను కూడా గుర్తించి ప్రకటించాలని విజ్ఞప్తి చేశాయి.
దేశంలో ఆర్ధిక సంక్షోభం యొక్క దుష్ప్రభావాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల కార్మికవర్గానికి నిజ వేతనాలు తగ్గి కొనుగోలు శక్తి క్షీణిస్తున్నది, వీటి ఫలితంగా వివిధ తరగతుల కార్మికులు, ఉద్యోగులు తమ జీవనం సాగించడం దుర్భరంగా తయారైంది. ఈ పూర్వ రంగంలో రాష్ట్రంలో వివిధ తరగతుల కార్మికులు, ఉద్యోగుల ముఖ్యమైన సమస్యలను రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం సమంజసమని కార్మిక సంఘాలు భావించాయి. ఇందుకు రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాలని కోరుతున్నది.
కార్మిక సంఘాలు రూపొందించిన మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు రాష్ట్రంలో కోటి మందికి ప్రయోజనం కల్గించే 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్ కనీస వేతనాలు సవరించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ శాఖలు, సంస్థల్లో పనిచేస్తున్న వారికి కనీస వేతనం రూ.26,000/-లుగా నిర్ణయించాలి. ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసి జీఓ 21, 22, 23, 24, 25లను గెజిట్ చేయాలి. హైకోర్టు జడ్జిమెంట్ను అమలు చేయాలి.  కనీస వేతనాల జీపీల సవరణలో జాప్యం జరిగితే పాత జీఓ గడువు ముగిసిన తేదీ నుండే ఎరియర్స్తో సహా చెల్లించాలి.పెరుగుతున్న శాస్త్ర సాంకేతికత దృష్ట్వా రోజుకు 7 గంటలు, వారానికి 5 రోజుల పని దినం అమలు చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలి.కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలి. లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమని నూతన అసెంబ్లీలో సమావేశాల్లో తీర్మానం చేయాలి. విద్యుత్, రైల్వే వంటి ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ చర్యలను మన రాష్ట్రంలో నిలిపివేస్తున్నట్లుగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. వలస కార్మికులకు 1979 అంతర్ రాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని పకడ్బందిగా అమలు చేయాలి. స్విగ్గీ, జొమాటో తదితర ఆన్లైన్ ఆధారితంగా పనిచేసే వారందరినీ కార్మికులుగా గుర్తించాలి. కాంట్రాక్ట్ లేబర్ ( రెగ్యులరేషన్ & అబాలిషన్) యాక్ట్ 1970 ప్రకారం కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి. వివిధ సంస్థలు, శాఖలు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో కార్మిక శాఖ అధికారులను (డిసిఎల్) నియమించాలి.  కార్మిక శాఖ అధికారులకు తనిఖీలు చేసే అధికారాలను పునరుద్ధరించాలి. తెలంగాణలో మూతబడిన పరిశ్రమలను పునరుద్ధరించాలి. ఆయా పరిశ్రమల్లో పనిచేసిన కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలి. నూతన పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పెన్సన్ స్కీమన్ను పునరుద్ధరించాలి. కు స్టాటూటరీ వర్కింగ్ రూల్స్ ని రూపొందించాలి. సేల్స్, ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్ట్ను పరిరక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు చెల్లించాలి.  కెజిబివి నాన్ టీచింగ్ స్టాఫిక్కు ఉద్యోగ భద్రత కల్పించాలి. వేతనాలు పెంచాలి, పర్మినెంట్ చేయాలి. మిషన్ భగీరథ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి. గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి. ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలి. 2వ పిఆర్సి పరిధిలోకి గ్రామ పంచాయితీ సిబ్బందిని తీసుకురావాలి. కారోబార్, బిల్ కలెక్టర్ లను సహాయ కార్యదర్శులుగా నియమించాలి. పర్మినెంట్ చేయాలి. జీవో నెం.51 ని సవరించాలి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి. పాత కేటగిరీలన్నింటినీ యధావిధిగా జి.హెచ్.ఎం.సిలో పని చేస్తున్న కార్మికులందరికీ బస్ పాన్లివ్వాలి. పేదలు, సామాన్యులు వినియోగించే మందులపై ధరలు తగ్గించాలి. మందులు, మందుల తయారీ పరికరాలపై జిఎనీ చేయాలి. మెడికల్ & సేల్స్ రిప్రజెంటేటివ్స్  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 30 శాతం పిఆర్సిని ఫైనల్ చేస్తూ జాప్యం లేకుండా అమలు చేయాలి. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎన్)ను పకడ్బందీగా అమలు చేయాలి. కేంద్ర, రాష్ట్ర స్కీమ్లలో పనిచేస్తున్న వారికి కార్మికులుగా గుర్తించాలి. కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, గ్రాట్యుటీ చెల్లించాలి. స్కీమ్ వర్కర్లకు సామాజిక భద్రత పథకాన్ని ప్రవేశపెట్టాలి.అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి.రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ.10 లక్షలు, హెల్పర్లకు రూ.5 లక్షలు చెల్లించాలి. వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలి. ఆశాలకు పారితోషికాలు కాకుండా ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి.మధ్యాహ్న భోజన నిర్వహణను అక్షయ పాత్ర లాంటి స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వరాదు. కొత్తగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహార పనికి అదనంగా వేతనాలివ్వాలి. ఐకెపి విఓఏ సిబ్బందిని సెర్చ్ ఉద్యోగులుగా గుర్తించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. తెలంగాణ అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న మిషన్ భగీరథ కార్మికులకు ప్రభుత్వమే నేరుగా వేతనాలు ఇవ్వాలి. గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. పంచాయితీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలి రెండవ పిఆర్సి పరిధిలోకి గ్రామపంచాయతీ సిబ్బందిని తీసుకురావాలి ఓ బార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలి పర్మినెంట్ చేయాలి మరి 51 ని సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి పాత క్యాటగిరి లన్నిటిని యధావిధిగ కొనసాగించాలి.మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కేటగిరీల వారీగా కనీస వేతనం నిర్ణయించి అమలు చెయ్యాలి. ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్, ఫిక్స్డ్-పే కార్మికులను పర్మినెంట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం. నిధుల నుండే ప్రతినెలా వేతనాలు చెల్లించాలి.పారిశుద్ధ్య సేవల్లో ప్రైవేటీకరణ చర్యలకు స్వక్తి పలకాలి. రాంకీ తదితర ప్రైవేట్ కంపెనీలతో జిహెచ్ఎంసి పనులు చేయించరాదు. గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగులకు అమలు చేసిన తేదీ నుండే పిఆర్సి అమలు చేయాలి.యూనివర్సిటీల్లో నాన్ టీచింగ్ డైలీవేజ్, ఎన్ఎంఆర్, కాంట్రాక్ట్, ఔట్ ఇస్తున్న మూల వేతనాన్ని కనీస వేతనంగా చెల్లించాలి. కాంట్రాక్టర్ మారితే సిబ్బందిని తొలగించే చర్యలు చేపట్టకూడదు. 10 సం॥లు సర్వీస్ దాటిన వారిని టైం స్కేల్ ఉద్యోగులుగా గుర్తించాలి.రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఏజెన్సీల రద్దు చేసి ప్రభుత్వమే ప్రతినెలా 5వ తేదీలోగా నేరుగా జీతాలు చెల్లించాలి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డులు జారీ చేయాలి. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ఎన్హెచ్ఎం 104, 108, ఆరోగ్యశ్రీ, టిసాక్స్, ఆయుష్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులర్ ఎంప్లాయీస్, మినిమం బేసిక్, డిఎ, హెచ్ఎమ్ల ఇవ్వాలి.104 ఎన్టీహెచ్ఎన్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించుటలో ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి, ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలి. వైద్య ఆరోగ్య శాఖలోని రేషనలైజేషన్ జీ.వో.నెం: 142ను రద్దు చేయాలి. ప్రభుత్వ అసుపత్రులలో పని చేస్తున్న కాంట్రాక్టు వర్కర్స్ వేతనాలు పెంచాలి.వైద్య విధానపరిషత్ అటానమన్ రద్దు చేసి వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగులకు ఉన్న హక్కులన్ని కల్పించాలి.రాష్ట్ర ప్రభుత్వ ఔట్ సోర్సింగ్, డైలీవేజ్, ఎన్ఎంఆర్, కంటింజెంట్ తదితర ఉద్యోగులకు ప్రాముఖ్యతనివ్వాలి. వారి సర్వీసుల ఆధారంగా దశల వారీ పర్మినెంట్ చెయ్యాలి.
సోర్సింగ్ తదితర సిబ్బందికి రెగ్యులర్ ఉద్యోగులకు పశుమిత్రులను కార్మికులుగా గుర్తించాలి. పనికి తగ్గ పారితోషికం ఇవ్వాలి. గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
తెలంగాణ మీ-సేవా ఉద్యోగులకు 2021 జూలై జీఓ నెం.60 ప్రకారం కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలి. మీ- సేవా ఉద్యోగులకు అదనపు పనికి ఓటి చెల్లించాలి.పెరుగుతున్న కొత్త సర్వీసుల కోసం నిరంతరం అదనపు సిబ్బందిని నియమించాలి. ఉన్న సిబ్బందికి పని భారం తగ్గించాలి. 55 సం॥రాలు వయస్సు పైబడిన విఆర్ఎల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. కోర్టు కేసులను ప్రభుత్వమే పరిష్కరించాలి. మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్లను ఫుల్ టైమ్ స్వీపర్లుగా గుర్తించాలి.  ప్రభుత్వరంగ సంస్థలు కార్పొరేషన్లు సింగరేణిలో అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు కోలిండియా వేతనాలను అమలు చేయాలి. సింగరేణి లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వాటా చెల్లించాలి. సింగరేణి పర్మినెంట్ కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన గత హామీ ప్రకారం సొంత ఇంటి కల నెరవేర్చాలి. సింగరేణిలో జరగబోయే యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఓటు హక్కు కల్పించాలి.సింగరేణి భూ నిర్వాసితుల కుటుంబాలకు కాంట్రాక్ట్ ఉద్యోగులు కాకుండా పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి.కార్మికుల హక్కులను హరించే అప్రజాస్వామిక ప్రవర్తనా నియమావళిని సింగరేణిలో మార్చాలి. ఆర్ టిసిని విస్తరించాలి. విద్యుత్ బన్లను ఆర్ టిసినే నడిపించేలా చూడాలి.  ఆర్టిసి విలీన ప్రక్రియను సరైన పద్ధతిలో చేయాలి. కో-ఆపరేటివ్ సొసైటీ, సామాజిక ట్రస్ట్లకు పెండింగ్ బకాయిలు చెల్లించాలి. 2017, 2021 పే-స్కేలు న్న తక్షణం నిర్ణయించి అమలు చెయ్యాలి.విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్స్ నందర్నీ అర్హతలను బట్టి జెఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్స్, సబ్ ఇంజనీర్స్, ఓఎన్లుగా కన్వర్షన్ ఇవ్వాలి. అన్మెన్డ్ కార్మికులను ఆర్టిజన్స్ గా గుర్తించాలి. గుర్తించేలోపు గ్రేడ్-2 వేతనం చెల్లించాలి. ఇపిఎఫ్ టు జిపిఎఫ్ మొత్తం ఉద్యోగులకు అమలు చేయాలి.. 2012-15 సంవత్సరాలలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఎన్.పి.డి.సి.ఎల్.ఎస్.పి.డి.సి.ఎల్ పరిధిలోని జిల్లా స్టోర్ లో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలి. ఆర్జిజన్లుగా గుర్తించాలి.  అసంఘటితరంగ కార్మికులుతెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అసంఘటితరంగ కార్మికులకు సమగ్ర శాసనం చేయాలి. అసంఘటితరంగ కార్మికులకు పెన్షన్ నెలకు రూ.7,000/-లకు తగ్గకుండా చెల్లించాలి.భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన మోటార్ సైకిల్స్ మరియు స్కూటీలు నిర్మాణ కార్మికులకు వెంటనే ఇవ్వాలి.వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మిక సంక్షేమం కోసమే ఖర్చు చేయాలి. అక్రమంగా దారి మల్లించిన రూ.1255 కోట్లను తిరిగిబోర్డులో జమ చేయాలి. బోర్డు ఆడ్వజరీ కమిటీ కార్మిక సంఘాల నాయకులతో నియమించాలి.1996 కేంద్ర చట్టంలోని అన్ని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేయాలి. బీడీ కార్మికులు బీడీ కార్మికులకు నెలలో 26 రోజులు పని కల్పించాలి. జి.ఎస్.టి. నుండి బీడీ పరిశ్రమను మినహాయించాలి.పిఎఫ్ ముడి పెట్టకుండా బీడీ పరిశ్రమలో ఉన్న అన్ని కేటగిరీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలి. కనీస వేతనాల జీఓ తక్షణమే విడుదల చేయాలి. కోస్టా చట్టాన్ని రద్దు చేయాలి. హమాలీ కార్మికులు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న హామాలీలు రైస్ మిల్లు ఆపరేటర్లు, దడవాయిలు, చాట, నడెం కార్మికులందరికీ పర్తిచేలా వెల్ఫేర్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి. సరిపడే బడ్జెట్ను ప్రభుత్వమే కేటాయించాలి. ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. 55 సం||రాలు పైబడిన వారికి నెలకు రూ.6000/- లు పెన్షన్ ఇవ్వాలి.ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు రవాణారంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రమాద బీమా సౌకర్యం రూ. 10 లక్షలు ఇవ్వాలి. ఓలా, ఊబర్, పోర్టర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే ఆన్లైన్ యావు ఏర్పాటు చేయాలి. పవర్ లూమ్ కార్మికులు వర్కర్ టూ ఓనర్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. ప్రభుత్వరంగ సంస్థలకు కావాల్సిన వస్త్రాలను మన రాష్ట్రంలోని పవర్ లూమ్ కార్మికుల తోనే ఉత్పత్తి చేయాలి. పూర్తి కాని టెక్స్టైల్ పార్కులను వెంటనే పూర్తిచేసి కార్మికులకు ఉపాధి కల్పించాలి.పవర్ లూమ్ కార్మికుడికి ప్రభుత్వ గ్యారంటీతో రూ॥ 5లక్షల పెట్టుబడి సాయం పవర్ లూమ్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలి. సెక్యూరిటీ గార్డ్స్ సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా వ్యవసాయ మార్కెట్ కమిటీల నుండే వేతనాలు, ఈపిఎఫ్, ఈఎన్ని చెల్లించాలి.5 లక్షల రూపాయల బీమా చెల్లిస్తున్నట్లుగా సెక్యూరిటీ గార్డులకు కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధుల నుండే బీమా పాలసీ చేయించాలి. ప్రభుత్వం సెక్యూరిటీ కార్మికులు, వాచ్మెన్స్కు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. సెక్యురిటీ సర్వీస్లో పనిచేసే గార్డుల సెక్యూరిటీ ఆఫీసర్ల వరకూ వెల్ఫేర్ బోర్డులో భాగస్వాముల్ని చేయాలి.సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు ఐ ఎన్ టి యు సి, సీనియర్ జిల్లా నాయకులు తాహెర్ బిన్, ఏ ఐ టి యు సి, జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓ మయ్య,, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాస్, రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేశారు.ఈ  కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు జంగం గంగాధర్, జిల్లా నాయకులు కటారి రాములు, గ్రామ పంచాయతీ జిల్లా నాయకులు సాగర్, ఆశ యూనియన్ జిల్లా నాయకులు రేణుక సుకన్య, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు నర్సింగ్ రావు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు.