పేపర్ లీకులు, పరీక్షల రద్దులలో తెలంగాణ టాప్

నవతెలంగాణ- భిక్కనూర్
పేపర్ లీకులు, పరీక్షల రద్దులలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని ఏబీవీపీ కామారెడ్డి స్టూడెంట్ ఫర్ సేవా కన్వీనర్ గందం సంజయ్ తెలిపారు. గురువారం భిక్కనూర్ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడేసి ఒక్క పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించకుండా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువకుల జీవితాలతో కెసిఆర్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడపాదడపా నోటిఫికేషన్లు వేస్తు వేసిన నోటిఫికేషన్ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి యువకులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా స్థలానికి చేరుకొని ఏబీవీపీ విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సమీర్ ఖాన్, చందు, శివకృష్ణ, యోగేష్, నిశాంత్, ఆదర్శ, రాజేందర్, దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.