– పట్టణీకరణలో దేశంలోనే రెండో స్థానం
– పట్టణాల్లోనే 47.6 శాతం జనాభా
– జాతీయ సగటు కంటే 12 .5 శాతం అధికం
– మూడు పట్టణాలకు ఇండియన్ స్వచ్ఛత లీగ్ – 2022 అవార్డులు
– ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌కు గుర్తింపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తు న్నాయి. రాష్ట్రంలో 47.6 శాతం ప్రజలు పట్టణాల్లోనే నివసి స్తున్నారు. ఇది జాతీయ సగటు కంటే 12.5 శాతం అధికం. పట్టణాల సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళికతో ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కలిపిస్తూ నివాసయోగ్య వాతావరణాన్ని కలిపించాలని 2020లో పట్టణ ప్రగతి పేరిట వినూత్న కార్యక్రమానికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ మహానగరంతో పాటు అన్ని నగరా లు, పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం కేసీఆర్ దిశానిర్ధేశంలో, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు నేతృత్వంలో తొమ్మిదేండ్లలోనే తెలంగాణ పట్టణాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించి పురోగమి స్తున్నాయి. కేంద్రం నుంచి 23 పట్టణ స్థానిక సంస్థలకు స్వచ్ సర్వేక్షణ్ అవార్డులు, 3 పట్టణ స్థానిక సంస్థలకు ఇండియన్ స్వచ్ఛత లీగ్ అవార్డులు లభించాయి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే పట్టణ ప్రగతికి సంబంధించి రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పట్టణీకరణలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఆసియా పసిఫిక్ స్థిరత్వ సూచిక 2021 ప్రకారం హైదరాబాద్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని మొదటి 20 స్థానాలలో స్థిరమైన నగరంగా పేర్కొన్నది. అదేవిధంగా భారతీయ నగరాల్లో మూడో స్థానంలో ఉంది. ఐక్యరాజ్య సమితిలోని అర్బర్ డే ఫౌండేషన్, ఆహార, ఏఎమ్‌పీబీ వ్యవసాయ సంస్థ వరుసగా రెండేండ్లు హైదరాబాద్‌ను ప్రపంచ వృక్ష నగరం-2021గా గుర్తించింది. దక్షిణ కొరియాలోని జెజులో నిర్వహించిన అంతర్జాతీయ ఉద్యానవన ఉత్పత్తుల సంఘం హైదరాబాద్‌కు ప్రపంచ హరిత నగరం-2022 అవార్డును ప్రకటించింది. రాష్ట్రంలో 129 మున్సిపాల్టీలున్నాయి. 12 కార్పొరేషన్ లు, జీహెచ్‌ఎంసీతో కలిపి మొత్తం 142 పట్టణ ప్రాంతా ల్లోని 3618 వార్డులలో కోటి నలభై నాలుగు లక్షల జనాభా నివసిస్తోంది. పట్టణ ప్రగతి కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటిదాకా అభివృద్ధి కోసం రూ.4537 .79 కోట్లు విడుదల చేయగా ఇప్పటికే రూ.4138 .84 కోట్ల నిధులని ఖర్చు చేశారు. సకాలంలో నిధులు విడుదల, అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పట్టణాలు విరాజిల్లుతున్నాయి. ఏ ఆసరా లేని అనాధలకు ఆశ్రయం కల్పించేందుకు 30 షెల్టర్లను ఏర్పాటు చేసింది. విద్యుత్ ఆదా చేసే ప్రయత్నంలో 9,11,234 ఎల్‌ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేసి ఏడాదికి రూ.128 కోట్ల విద్యుత్ బిల్లులను ప్రభుత్వం ఆదా చేసింది.పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. చెత్త రవాణాకు 4713 వాహనాలు ఏర్పాటు చేసి రోజుకు 4356 టన్నుల చెత్తను తరలిస్తున్నది. ఇందుకు వివధ ప్రాంతాలలో 1233 .27 ఎకరాలలో 141 డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసింది. ఘన వ్యర్ధ పధార్ధాల నిర్వాహణకు 229 కంపోస్ట్ షెడ్స్‌ను ఏర్పాటు చేసి ఎరువు తయారు చేయిస్తున్నది. 100శాతం చెత్తను సేకరిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం ప్రకటించింది. .141 పట్టణ స్థానిక సంస్థలలో రూ.428 .02 కోట్లతో 139 మానవ వ్యర్ధాల ట్రీట్మెంట్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేసారు, మరో 14 నిర్మాణంలో ఉన్నాయి. హరితహారం కార్యక్రమం కింద 3618 వార్డులలో 1612 నర్సరీలను ఏర్పాటు చేసారు. ఈ ఏడాది 214,91 లక్షల మొక్కల లక్ష్యం కాగా ఇప్పటికే నర్సరీలలో 248.38 లక్షల మొక్కలను పెంచుతున్నారు. గత ఏడాద నిర్ధేశించుకున్న 251 .60 మొక్కల లక్ష్యానికి మించి 252 .27 మొక్కలను 141 పట్టణ స్థానిక సంస్థలలో నాటి 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసారు. 2818 పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా ఈ ఏడాది మార్చి చివరి నాటికి రోడ్లకు ఇరువైపులా 1208.52 కిలోమీటర్ల మేర 19.98 లక్షల మొక్కలను నాటారు. 2020 -21 నుండి 2023 -21 వరకు మొత్తం రూ.778 .33 కోట్ల గ్రీన్ బడ్జెట్ ను కేటాయించారు. ఉద్యోగులు , వ్యాపారాలు గత ఏడాది రూ.143.25 లక్షలు హరిత నిధికి జమ చేసారు.
ఆహ్లాదం ఆరోగ్యం కోసం…
రాష్ట్రంలో పట్టణాల్లో ఆరోగ్యం, ఆహ్లాదానికి పార్క్‌లతో పాటు 368 ఓపెన్ జిమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా 1273 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసింది. పలు పట్టణాల్లో ప్రత్యేకంగా సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేశారు.
వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటు
ప్రజలకు అనుకూలంగా ఒకే చోటు కూరగాయలు పండ్లు, పూలు, మాసం, చేపలు లభించాలనే ఉద్దేశంతో రూ.500 కోట్ల బడ్జెట్ ను కేటాయించి సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. 25 వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న 57 పట్టణాల్లో ఒక్కోటి రెండు కోట్లతో, 25 వేల కన్నా అధికంగా ఉన్న 81 పట్టణాల్లో రూ.4.50 కోట్లతో ఈ మార్కెట్లను నిర్మిస్తున్నారు.
వైకుంఠధామాలు
రాష్ట్రంలోని 141 పట్టణ స్థానిక సంస్థలలో 453 లక్ష్యంగా కాగా.. ఇప్పటికే 304 వైకుంఠధామాలు నిర్మించారు. 176 వైకుంఠ రథాలను ఏర్పాటు చేసారు. రాష్ట్రంలో పురపాలికల్లో చేస్తున్న అభివృద్ధి పనులు దేశ వ్యాప్తంగా ఆకట్టుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల బృందాలు అధ్యయనం చేసేందుకు రాష్ట్రానికి వచ్చే స్థాయికి తెలంగాణ పట్టణాలు ఎదిగి అభివృద్ధికి చిహ్నాలుగా మారాయి.