– కొత్త ఓట్లు 17.01 లక్షలు తుది జాబితా విడుదల
నవ తెలంగాణ- హైదరాబాద్ బ్యూరో
తెలంగాణలో ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలో సర్వీసు ఓటర్లతో కలిపి మొత్తం 3కోట్ల17లక్షల 32వేల 727 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే 5.8 శాతం ఓట్లు పెరిగినట్లు పేర్కొంది. పురుష ఓటర్లు – 1,58,71,493 మంది కాగా మహిళా ఓటర్లు 1,58,43,339 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు – 2,557 మంది. సర్వీస్ ఓటర్లు 15,338 మంది. ఇందులో కొత్త ఓటర్ల సంఖ్య 17.01 లక్షలు కాగా తొలగించిన ఓట్లు – 6.10 లక్షలు. ఓటర్ల జాబితా ప్రకారం లింగ నిష్పత్తి – 998:1000గా ఉన్నట్లు సీఈసీ వెల్లడించింది. 6,98,133 మంది ఓట్లతో అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవ ర్గంగా శేరిలింగంపల్లి నమోదయింది. ఎల్‌బీ నగర్‌లో 5,66,866 మంది ఓటర్లు, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 5,52,455 మంది ఓటర్లు ఉన్నారు.