కేసీఆర్‌ ఒక్కడితోనే తెలంగాణ ఏర్పడలేదు : రేవూరి

నవతెలంగాణ-సంగెం
పరకాల కాంగ్రెస్‌ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌ రెడ్డి ఎన్నికల ప్రచా ర యాత్ర ఊరూరా ఉత్సాహంగా కొనసాగుతోంది. మండలంలో బిక్కోజినాయక్‌ తండాతో మొదలై ఎలుగూరు స్టేషన్‌, నర్సాన గర్‌, తిమ్మాపురం మీదుగా సాగింది. రేవూరి ప్రకాశ్‌ రెడ్డి మాట్లా డుతూ నియోజకవర్గంలో ఎవరిని కదిలించినా చల్లా ధర్మారెడ్డి అక్రమాల గురించే చెబుతున్నారని అన్నారు. అసైన్డ్‌ భూములు, చెరువు శిఖం భూములు,ప్రభుత్వ భూములను కబ్జా చేసిన దగా కోరుగా ప్రజల గుండెల్లో ధర్మారెడ్డి చెరగని స్థానమే సంపాదిం చుకున్నారని విమర్శించారు. నిమ్మగడ్డ షాడో ఎమ్మెల్యేగా కొన సాగుతూ ఉండడం అందరికీ తెలుసన్నారు. కెసిఆర్‌ ఒక్కడి పో రాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని వందలాది మంది యువకుల బలిదానాలతో తెలంగాణ సిద్ధించిందని చెప్పారు. ఎన్నో ఆశలతో సోనియమ్మ ఇచ్చిన తెలంగాణను భ్రష్టు పట్టిం చారని మండిపడ్డారు. ప్రచారంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు దొ మ్మాటి సాంబయ్య, ఎంపీపీ భీమగాని సౌజన్య, నాయకులు గ న్నోజు శ్రీనివాసచారి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పేదల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యం
ఆత్మకూర్‌ : సిట్టింగ్‌ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి లాగా గుట్ట లను, ప్రభుత్వ భూములను దోచుకోవడానికి రాలేదు నిరుపేద లందరికీ సంక్షేమ పథకాలు అందించి వారిలో చిరున వ్వు చూడ డమే నా లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే కాంగ్రెస్‌ అభ్యర్థి రేవూరి ప్ర కాశ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండ లోని రే వూరి నివా సంలో రాష్ట్ర ఉత్తమ సర్పంచ్‌ అవార్డు గ్రహీత పర్వత గిరి రాజు, శ్రీధర్‌రెడ్డిల ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీల ఫోరం జిల్లా కార్య దర్శి మొద్దు ప్రవీణ్‌తోపాటు టిఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు భారీసంఖ్యలో రేవూరి ప్రకాష్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి రేవూరి ప్రకాష్‌రెడ్డి స్వా గతించారు. చౌళ్లపల్లి సర్పంచ్‌ కంచ రవికుమార్‌ ఆధ్వర్యం లో బీజేపీ మాజీ మండల అధ్యక్షులు రాజిరెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా నా యకులు కొక్కరకొండ గణేష్‌, సూరయ్య, ఎన్‌ రెడ్డి రమణ, మో టి వీరన్న, చిలుక చిరంజీవి, ఈసంపల్లి రాజుతోపాటు 200 మంది కార్యకర్తలు రేవురి ప్రకాష్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా వారంద రికీ పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్య నాయకులు గాజర్ల అశోక్‌, దామేరా మండల అధ్యక్షులు మాన్యం ప్రకాశ్‌ రెడ్డి, మాజీ ఎంపిటిసి నత్తి కోర్నెల్‌, కాంగ్రెస్‌ సర్పంచులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.