సబ్బండ వర్గాల పోరాట ఫలితం ”తెలంగాణ” : వైఎస్‌ షర్మిల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సబ్బండ వర్గాల పోరాటం ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం మూడు కోట్ల మంది ప్రజలు ఏకమై, కొట్లాడితే రాష్ట్రం అవిర్భవించిందని పేర్కొన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలోఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలు కనుమరుగ వుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.