నవతెలంగాణ- కమ్మర్ పల్లి: మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న అధ్యక్షతన తెలుగు సముదాయ సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ సూచనలు ప్రకారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యంగా ఉన్నతి కార్యక్రమం, లక్ష ప్రణాళిక ప్రకారంగా ఉపాధ్యాయుల బోధన తీరు, బేస్ లైన్ టెస్ట్ నిర్వహించిన తీరు, ప్రగతి నమోదు, నిర్మాణాత్మక-సంగ్రహణాత్మక పరీక్షల నిర్వహణ తీరు చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా తెలుగు రిసోర్స్ పర్సన్ ప్రవీణ్ శర్మ, కాంప్లెక్స్ కార్యదర్శి పుట్టా రాజేశ్వర్ భాషోపాధ్యాయులకు తగు సలహాలు సూచనలను అందించారు.ఈ కార్యక్రమంలో తెలుగు భాష ఉపాధ్యాయులు పతాని గంగాధర్, శ్యామ్ చరణ్, కైలాస్, గీత, కమ్మర్ పల్లి, మోర్తాడ్ ఏర్గట్ల మండలాల తెలుగు భాషోపాధ్యాయులు 30 మంది పాల్గొన్నారు.