మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె తాత్కాలిక వాయిదా

నవతెలంగాణ- కంటేశ్వర్:
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె నిరవధిక సమ్మె నిర్వహించడం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ మేరకు, యూనియన్ రాష్ట్ర విస్తృత సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అక్టోబర్ 11 నుండి మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్, అధ్యక్షురాలు చామంతి లక్ష్మి తెలియజేశారు. ఈ మేరకు సమ్మె వాయిదా నోటీసును జిల్లా విద్యాశాఖ ఏడి కి బుధవారం అందజేశారు. త్వరలోనే పెండింగ్లో ఉన్న బిల్లులు, 3000 రూపాయల గౌరవ వేతనాన్ని చెల్లించడానికి కలిగే ఇబ్బందులను అధిగమించడానికి రాష్ట్ర కమిషనరేట్ స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించారని అన్నారు. మిగిలిన డిమాండ్ల సాధన కోసం భవిష్యత్తులో సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.