మద్యం షాపులకు టెండర్లు ఆహ్వానం..

మద్యం షాపులకు టెండర్లు ఆహ్వానం: ఎక్సైజ్ సిఐ మహేంద్ర కుమార్ 
నవతెలంగాణ-చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని 16 మద్యం షాపులకు నూతన టెండర్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని శుక్రవారం చేర్యాల ఎక్సైజ్ సిఐ మహేంద్ర కుమార్ తెలిపారు. ఈ టెండర్లలో గౌడ సామాజిక వర్గానికి నాలుగు, ఎస్సీ సామాజిక వర్గానికి మూడు, జనరల్ కేటగిరీకి తొమ్మిది షాపులు కేటాయించినట్లు తెలిపారు. రిజర్వేషన్ల వారీగా చేర్యాల పట్టణంలో షాప్ నెంబర్ 1 జనరల్, షాప్ నెంబర్ 2 ఎస్సీ, షాప్ నెంబర్ 3 జనరల్, షాప్ నెంబర్ 4 జనరల్, షాప్ నెంబర్ 5 గౌడ, షాప్ నెంబర్ 6 జనరల్, కుకునూరు పల్లి మండల కేంద్రంలో  షాప్ నెంబర్ 1 గౌడ, షాప్ నెంబర్ 2 ఎస్సీ, కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో  షాప్ నెంబర్ 1 జనరల్, షాప్ నెంబర్ 2  గౌడ, మద్దూరు మండల కేంద్రంలో షాప్ నెంబర్ 1 జనరల్, షాప్ నెంబర్ 2 జనరల్, దూలిమిట్ట మండల కేంద్రంలో షాప్ నెంబర్ 1 జనరల్, షాప్ నెంబర్ 2  ఎస్సీ, కొమురవెల్లి మండల కేంద్రంలో షాప్ నెంబర్ 1 గౌడ, షాప్ నెంబర్ 2 జనరల్ పై విధంగా రిజర్వేషన్ల  ఉన్నాయని తెలిపారు. ఈ నెల 4 నుండి 18 వరకు జిల్లా కేంద్రం సిద్దిపేటలోని ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు తీసుకుంటారని, 21న, సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో డ్రా పద్ధతిలో వైన్స్ షాపులు కేటాయిస్తారని తెలిపారు.