జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో ఉద్రిక్తత

-ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల ఆందోళన
కొల్‌కతా : తాత్కాలిక వైస్‌ ఛాన్సలర్‌ బుద్ధదేవ్‌ సాకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. దీంతో విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్యాంపస్‌లో ర్యాగింగ్‌కు అడ్డుకట్ట వేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా యూనివర్సిటీ అధికారులు సంబంధిత వ్యక్తులందరితోనూ చర్చించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీ వీసీ సోమవారం పరిపాలనా భవనం నుండి బయటికి వెళుతుండగా ఎస్‌ఎఫ్‌ఐకి చెందిన ఆర్ట్స్‌ ఫ్యాకల్టీ స్టూడెంట్స్‌ యూనియన్‌ విద్యార్థులు ఆయన్ని అడ్డుకొని తమ డిమాండ్‌ను వినిపించారు.