ఉగ్రవాది సులేమాన్‌ అరెస్ట్‌

– ఇంటి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్న ఇంటెలిజెన్స్‌ అధికారులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంతోపాటు మధ్యప్రదేశ్‌లో విధ్వంసాలకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న ఉగ్రవాది సులేమాన్‌ను రాష్ట్ర కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులు బుధవారం అరెస్టు చేశారు. నగరం నుంచి ఐదుగురు ఉగ్రవాదులను మధ్యప్రదేశ్‌ ఏటీఎస్‌ అధికారులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరి అనుచరుడైన సులేమాన్‌ పరారీలో ఉండగా గాలింపు చర్యలు జరిపిన అధికారులు ఎట్టకేలకు జవహర్‌నగర్‌ ప్రాంతంలో అరెస్టు చేశారు. జవహర్‌నగర్‌ శివారులోని బాలాజీనగర్‌లో ఇతర ఇండ్లకు దూరంగా ఉన్న ఒక ఇంట్లో టీవీ మెకానిక్‌గా నివసిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సులేమాన్‌ తన ఇంటికి నాలుగు దిక్కుల్లో సీసీ కెమెరానలు పెట్టుకున్నాడని పోలీసు అధికారులు గుర్తించారు. ఇదే ఇంటి నుంచి కొన్ని ఆయుధాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.