బీ ఈ డీ  కళాశాల ఫై చర్యలు తీసుకోవాలి.. టిజివిపి డిమాండ్

నవతెలంగాణ డిచ్ పల్లి: తెలంగాణ విద్యార్థి పరిషద్   ఆధ్వర్యంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నా రాఘవేంద్ర బి.ఈడి కలశాల  పై చర్యలు తీసుకోవాలని, అ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి కి నగర అధ్యక్షుడు అఖిల్ వినతి పత్రాన్ని  శుక్రవారం అందజేశారు. ఈ సంధర్బంగా నగర అధ్యక్షుడు అఖిల్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో గల రఘువెంద్ర  బిఈడి కళాశాల విద్యార్థుల వద్ద అధిక పరీక్ష ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తూ సెమిస్టర్ పరీక్షల ఫీజు 1440  విద్యార్థులు చలించల్సి ఉండగా  ఒక్కొక్కరి వద్ద నుండి 2500 వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వివరించారు. డెవలప్మెంట్ ఫీజులు, అటెండెన్స్ ఫీజుల పేరుతో విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, అ కళాశాల్లో కనీస అధ్యాపకులు లేరని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు,  వసతులు లేకుండా కళాశాల నడిపిస్తున్నారని రాఘవేంద్ర కళాశాల ఫై వేంటనే చర్యలు తీసుకోనీ  కళాశాల గుర్తింపును రద్దు చేయాలని  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో మహేష్, సుజిత్, సొహెల్, అధీబ్ తదితరులు పాల్గొన్నారు.