నవతెలంగాణ- కంటేశ్వర్:
గణేష్ విగ్రహ ప్రతిస్తావన నుండి నిమజ్జనం వరకు అలాగే మిలాద్ ఉన్ నబీ కి సహకరించిన ప్రతి ఒక్కరికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు శుక్రవారం వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివి జన్ పరిధిలోని గణేష్ విగ్రహాల నిమజ్జనం శోభాయాత్ర / మిలాద్ ఉన్ నఖీ పండుగ ప్రశాంతంగా ముగిసిందని, ఇందుకు సహాకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు అని, ప్రశాంత వాతావరణంలో గణేష్ విగ్రహాల ప్రతిస్థాపన నుండి నిమజ్జనం వరకు/ మిలాద్ ఉన్ నఖీ వరకు హిందూ, ముస్లీం, సిక్కు, క్రిస్టియన్, ఇతర మతాల ప్రజలు, సార్వ జనిక్ గణేష్ మండలి, గణేష్ మండలి కమిటీలు, మజీద్ కమిటీలు, ప్రతిఒక్కరు చాలా సహాకరించారని, ఇదే విధంగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, రెవెన్యూ శాఖ ఆర్.డి.ఓలు, తహసిల్దార్లు, అటవీశాఖ, ఫైర్ సర్వీస్, ఎన్.సి.సి, వాలంటీరుల వివిధ ఇతర శాఖల అధికారులు యంచ గ్రామ ప్రజలు సిబ్బంది, ఎలక్ట్రానిక్ / ప్రింట్ మీడియా ప్రతినిదులు మొదలగువారందరికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతు న్నట్లు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, ఐ.పి.యస్, అన్నారు.