అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా మంథనిలో ముఖ్యమంత్రి కేసీఆర్ హజరైన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు బారీగా తరలివచ్చి సభను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి బీఆర్‌ఎస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి ఇరువై ముప్పై వేల మంది మాత్రమే వస్తారని అంచనా వేశామని, కానీ అరవై వేలకు పైగా ప్రజలు తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు ఎంతో కష్టపడి సభకు తరలివచ్చారని, ఒక్కో వాహనంలో మోతాదుకు మించి రావడం శుభపరిణామమేనన్నారు. అంతేకాకుండా బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి సభ సక్సెస్‌లో బాగస్వాములయ్యారని ఆయన కొనియాడారు. సీఎం కేసీఆర్ సభకు బారీగా తరలి రావడం, ప్రజలను సమీకరణకు కృషి చేసిన పార్టీశ్రేణులను ఆయన అభినందిస్తూ ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.