కోతల్లేని కరెంట్‌ ఇస్తున్న కేసీఆర్‌కు థ్యాంక్స్‌

– మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అంతరాయం లేని విద్యుత్‌ను అందిస్తూ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌ కు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షాభావ పరిస్థితులున్నప్పటికీ ఈ వానాకాలంలో 57.51 లక్షల ఎకరాల్లో వరి, 44.73 లక్షల ఎకరాల్లో పత్తి, 5.28 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4.61 లక్షల ఎకరాల్లో కందులతో కలుపుకుని రాష్ట్రంలో 1.18 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల వ్యవసాయ పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. భాగర్భ జలాలు పెరగడం, గతేడాది సెప్టెంబర్‌ ఒకటిన 11,198 మెగావాట్లుంటే, ఈ ఏడాది సెప్టెంబర్‌ ఒకటిన 14,747 మెగావాట్లు అత్యధిక డిమాండ్‌ నమోదైందని చెప్పారు.