అది మోడీ షో

– భోపాల్‌ సభలో అంతా ఆయనే
భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో బీజేపీ నిర్వహించిన జన ఆశీర్వాద యాత్ర ముగింపు సందర్భంగా భోపాల్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ అంతా తానై వ్యవహరించారు. వేదికపై ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, జ్యోతిరాదిత్య సింధియా, ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌, ఫగ్గన్‌ సింగ్‌ కులస్థే, వీరేంద్ర కుమార్‌ ఖతిక్‌ వంటి హేమాహేమీలు ఆశీనులైనప్పటికీ ప్రధాని వచ్చిన తర్వాత ప్రసంగించే అవకాశం ఒక్క శివరాజ్‌ సింగ్‌కే లభించింది. ఆయన కూడా క్లుప్తంగా మాట్లాడి కూర్చున్నారు. ప్రధాని రాకముందు తోమర్‌, ఖతిక్‌ కొద్దిసేపు ప్రసంగించారు. మిగిలిన వారెవ్వరికీ ప్రసంగించే అవకాశం ఇవ్వలేదు.