– ఇన్ఫినిటీ లెర్న్ బై శ్రీచైతన్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
లాభాలతోపాటు బలమైన రాబడి వృద్ధిని ఇన్ఫినిటీ లెర్న్ బై శ్రీచైతన్య నివేదించింది. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.500 కోట్ల కంపెనీగా కావడమే లక్ష్యమని ప్రకటించింది. ఈ మేరకు ఇన్ఫినిటీ లెర్న్ బై శ్రీచైతన్య వ్యవస్థాపక సీఈవో ఉజ్వల్ సింగ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2021-22లో అద్భుతమైన వృద్ధిని ప్రదర్శిస్తూ 2022-23కి ఆడిట్ చేసిన ఆర్థిక వివరాలను ప్రకటించామని తెలిపారు. కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 2021-22లో కేవలం రూ.2.3 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. 2022-23లో రూ.వంద కోట్లకు చేరుకుందని వివరించారు. ఈ కాలంలో వ్యయాల్లో కేవలం రెండు రెట్లు పెరిగిందని తెలిపారు. దేశంలో ఏకైక లెర్నర్ అవుట్‌కమ్ ఆధారిత లాభదాయకమైన ఎడ్‌టెక్ స్టార్ట్‌అప్‌గా ఇన్ఫినిటీ లెర్న్ కొత్త ప్రమాణాలను నెలకొల్పడం, విద్యారంగంలో నూతన ఆవిష్కరణను ప్రేరేపిస్తున్నదని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న ఎడ్‌టెక్ రంగంలో ముందుకెళ్లాలని తెలిపారు.