
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోని అంజనీ గ్రామానికి చెందిన విద్యార్థి వరంగల్ కాలోజీ యూనివర్సిటీ విడుదల చేసిన ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షల్లో సీటు సాధించారు. ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు రావడంతో అధికారులు రఘునాథ్ కు సిద్దిపేట్ సురభి మెడికల్ కళాశాలలో సీటు కేటాయించారు జిల్లాలోని మారుమూల గ్రామమైన అంజనేనుండి రఘునాథ్ సీటు సాధించడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రఘునాథ్ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుండగా వ్యవసాయ కుటుంబం నుండి ఎంబీబీఎస్ సీటు రావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్ సీటు సాధించిన రఘునాథ్ నీ ఎంపీపీ ప్రతాపరెడ్డి అభినందించారు. రఘునాథ్ 1 నుండి 5 వ తరగతి వరకు పిట్లం బ్లూబెల్స్ పాఠశాలలో, 6 నుండి 10 వరకు నిజాంసాగర్ జోహార్లాల్ నవోదయ, ఇంటర్ ఇంపల్స్ హైదరాబాద్ చదివినట్లు రఘునాథ్ తెలిపారు. ఎంబిబిఎస్ తర్వాత మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని తెలిపారు.