భూములందించిన రైతుల ఆశయం వృథా కానియ్యం

– భూ నిర్వాసితుల చెక్కులందజేతలో ఎమ్మెల్యే రసమయి
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని దాచారం గ్రామ శివారులో పారిశ్రామిక సంస్థలను ఏర్పాటుచేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ సంకల్పానికి..భూములందజేసిన రైతుల ఆశయాన్ని వృథా కానియ్యమని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో దాచారం గ్రామంలోని 124 సర్వే నంబర్ యందు 45 మంది భూ నిర్వాసితులకు సుమారు రూ.9 కోట్ల చెక్కలను ఎమ్మెల్యే రసమయి అందజేశారు.ప్రజాప్రతినిధులు,బీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు,భూ నిర్వాసితులు హజరయ్యారు.
 ఆడబిడ్డల అడ్డగింత..
124 సర్వే నంబర్ యందు భూ నిర్వాసితులకు పరిహరమందజేతలో అధికారులు చేతివాటం ప్రదర్శించి విస్తీర్ణం నమోదులో అన్యాయం చేశారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమకు తెలియకుండా అధికారులు అక్రమాలకు పాల్పడి పరిహరం అందజేస్తున్నారని మాకు పరిహరంలో వాట ఉంటుందని ఆడబిడ్డలు అడ్డు చెప్పడంతో పలువురి భూ నిర్వాసితులకు అధికారులు చెక్కులను నిలుపుదల చేశారు.