గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన అంగన్వాడీ

నవతెలంగాణ- రామారెడ్డి:
 మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు సోమవారం అంగన్వాడీలు, ఆశ వర్కర్లు సమ్మెను కొనసాగించారు. గాంధీ జయంతి సందర్భంగా అంగన్వాడీలు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె లో భాగంగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.