నవతెలంగాణ- వీర్నపల్లి
భూమి కొసం భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగినదే రైతాంగ సాయుధ పోరాటమని సీఐటియు జిల్లా అధ్యక్షులు ఎగుమంటి ఎల్లారెడ్డి, సీపీఎం జిల్లా కమిటి సభ్యులు అరుణ్ కుమార్ అన్నారు.వీర్నపల్లి మండల కేంద్రంలో ఆదివారం అమరవీరుల స్థూపం ఆవరణంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం – సిఐటియూ ఆధ్వర్యంలో వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభను నిర్వహించి సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు భూమికోసం భుక్తి కోసం వేట్టి చాకిరి విముక్తి కోసం నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మట్టి మనుషులు చేసిన మహోన్నత ఉద్యమామే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని అన్నారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో కుల మత ప్రాంత భేదాలు లేకుండా పీడిత ప్రజలందరూ ఐక్యంగా సాధించిన కీలక పోరాటమన్నారు. ప్రపంచంలోనే ప్రఖ్యాత గాంచిన పోరాటమని అన్నారు. 4000 మంది కమ్యూనిస్టులు అమరులు అయ్యారని 3000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ప్రజలు స్థాపించారని, 10 లక్షల ఎకరాలను పేదలకు పెంచిన ఘనత కమ్యూనిస్టులకి దక్కుతుందన్నారు. ఎంతటి క్రూర నిర్బంధాన్ని విధించిన ఎదురు నిలబడి పోరాడి ప్రాణాలను త్యాగం చేసిన ఫలితమన్నారు. రాష్ట్రంలో సాయిధ పోరాటంతో సంబంధంలేని రాజకీయ పార్టీలు తమ ఉనికి కోసం చరిత్రను వక్రీకరిస్తున్నాయని అన్నారు. విమోచన దినం విద్రోహ దినం విముక్తి దినం, సమైక్యత దినోత్సవాలంటూ సాయుధ పోరాట చరిత్రను కనుమరుగు చేసే కుట్రలు చేస్తున్నాయన్నారు. నిజం ప్రభుత్వం సాయుధ పోరాటనికి తలవొంగి భారత యూనియన్ లో విలీనం అయిందని భారత యూనియన్లో విలీనం కావడానికి కమ్యూనిస్టుల పోరాట ఫలితమే అమరవీరుల త్యాగమేనాని వారి త్యాగాలను కొనియాడారు. వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో కార్మికులు, ప్రజలు పోరాటం చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు జలాపల్లి మనోజ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గుంటుకు నరేందర్ , హమాలి సంఘం మండల అధ్యక్షులు రాజేశం, భవన నిర్మాణ సంఘం మండల అధ్యక్షులు బుసా రాజం, సీఐటీయు సిపిఎం నాయకులు రాజేల్లయ్య , ప్రణీత్ రాజు, శంకర్ లింబయ్య గోవింద్ దేవయ్య తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.