దాడువాయిలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి

నవతెలంగాణ-కాశిబుగ్గ
రాష్ట్రంలోని వ్యవసాయ మార్కె ట్‌ యార్డులలో పనిచేస్తున్న దాడువా యిలను నాలుగవ తరగతి ఉద్యోగు లుగా గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్‌ దాడువాయి కార్మిక సంఘం నాయకులు కోరారు. ఈమేరకు శనివారం జేడీఎం మల్లేశంను కలిసి వినతిపత్రం సమర్పించా రు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విజరుకుమార్‌, అప్ప ని కృష్ణలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ సమ యంలో ఉద్యమంలో భాగస్వామ్యం అయిన దాడువాయిలను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చ లేదన్నారు. దాడువాయిలను మార్కెట్‌ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.35వేలు ఇవ్వాలన్నారు. దాడువాయిలను ఉద్యోగులుగా గుర్తించడం వల్ల ప్రభుత్వంపై ఎటువంటి భారం ఉండదన్నారు. ఈనామ్‌ లో స్కిల్‌ వర్కర్స్‌ గా పనిచేస్తున్న తాము నాలుగో తరగతి ఉద్యోగులుగా అర్హులం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాంబాబు, కోశాధికారి సురేందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.