బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్‌ కష్ణయ్య
 కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి వినతిపత్రం
నవతెలంగాణ-అడిక్‌మెట్‌
పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించాలని బీసీ కుల గణన చేపట్టా లని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎం పీ ఆర్‌.కష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని తన కార్యాలయంలో కలిసి విన తి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కష్ణయ్య మా ట్లాడుతూ.ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వాలు గత 75 సంవ త్సరాలుగా బీసీలకు ఏ రంగంలో కూడా జనాభా ప్రకారం వాటా ఇవ్వలేదని, విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో కనీస ప్రాతినిధ్యం లభించలేదన్నారు. పార్లమెంటులో బి.సి. బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీ లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని. బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లను రిజర్వేషన్లు కల్పించాలని, ఇం దుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. బీసీల న్యా యమైన డిమాండ్‌ త్వరలో పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. కేంద్రంలో ప్రత్యే క బీసీ మంత్రిత్వ శాఖ బీసీల బడ్జెట్‌ పెంచడానికి తనవంతు కషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గుజ్జ కష్ణ, డా. నంద కిశోర్‌, నీల వెంకటేష్‌, భూపేష్‌ సాగ ర్‌, నందగోపాల్‌, రామ కష్ణ, సి. రాజేందర్‌, రాజ్‌ కుమార్‌, మోడీ రాందేవ్‌, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలలోకి తీసుకెళ్లాలి
అంబర్‌పేట :
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలకు తీసుకెళ్లాలని కేంద్ర మం త్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం అంబర్‌పేట నియో జకవర్గం మహారాణా ప్రతాప్‌ ఫంక్షన్‌ హాల్‌ లో వివిధ మో ర్చాల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో అంబర్‌ పేట నియోజకవర్గంలో బీజే పీ జెండా ఎగరడంలో మోర్చాలు ప్రముఖ పాత్రను పోషిం చబోతున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కతిక, ఈశాన్య మంత్రి కిషన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు కోసం అన్ని మోర్చాలు త్వరితగతిన కమిటీలను పూర్తి చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అంబర్‌పేట అసెంబ్లీ కన్వీనర్‌ శ్యామ్‌రాజ్‌, గద్వాల జిల్లా ఇంచార్జ్‌ వెంకట్‌ రెడ్డి, ఓబీసీ రాష్ట్ర నేత ఆనంద్‌గౌడ్‌, కార్పోరేటర్లు అమత, పద్మ వెంకట్‌ రెడ్డి, ఉమా రమేష్‌ యాదవ్‌, నాయకులు పాల్గొన్నారు.