బీడీ ఫ్యాక్టరీ వారు కురుకురే ప్యాకెట్లు అమ్మాలని బీడీ కార్మికులపై ఒత్తిడి

నవతెలంగాణ – కంటేశ్వర్
దేశాయి బీడీ ఫ్యాక్టరీ వారు కురుకురే ప్యాకెట్లు అమ్మాయిలని బీడీ కార్మికులపై ఒత్తిడి చేయడాన్ని ఆపల్సిందిగా కోరుతూ గురువారం సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. దేశాయి బీడీ ఫ్యాక్టరీ పరిధిలోని వివిధ బ్రాంచ్ లలో పనిచేస్తున్న బీడీ కార్మికులు, టేకేదారులు, బట్టి కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము. దయచేసి వాటిపై విచారణ జరిపి కంపెనీ పైన తగిన చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.ముఖ్యంగా దేశాయి బీడీ ఫ్యాక్టరీ వారు “కురుకురే’ అనే స్నాక్స్ చేస్తున్నారు. దాని మార్కెటింగ్ కొరకు బీడీ తయారు కార్మికులను బలవంతంగా వినియోగిస్తున్నారు. బీడీ కార్మికులు ఆకు, తంబాకు కొరకు బీడీలు చుట్టి టేకేదారుకు అప్పగించేటప్పుడు ‘కురుకురే ప్యాకెట్లను తీసుకోవాలని, వాటిని అమ్మి (ఒక్కొక్క ప్యాకెట్టు ఖరీదు ఐదు రూపాయలు చొప్పున) డబ్బు తీసుకురావాలని ప్రతి కార్మికురాలకు టేకేదారులు బలవంతంగా అప్పజెప్తున్నారు. వాటిని తీసుకొని ప్రజలకు అమ్మాలని ఒత్తిడి తీసుకొని వస్తున్నారు. ఈ విధంగా అన్ని బ్రాంచీలలోని టేకేదారులకు కురుకురే ప్యాకెట్లు అప్పగించటం జరుగుతోంది. టేకేదారులు తమ పరిధిలోని కార్మికులకు అప్పగించి వాటి డబ్బు తీసుకురావాలని బలవంతం పెడుతున్నారు. వ్యతిరేకించే వారిపై కక్ష సాధిస్తున్నారు. బీడీ కార్మికులు ప్యాకెట్లు అమ్మ లేక ఇంట్లోనే ఉంచుకోవడం వలన పిల్లలు సహితం ఆ ప్యాకెట్లలోని స్నాక్స్ కొన్ని సందర్భాలలో వీటిని వాడిన కుటుంబ సభ్యులకు మోషన్స్ ఇతర అనాఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కార్మికులకు బట్వాడా చేసేటప్పుడు ప్యాకెట్ల డబ్బును మినహాయించుకుని వేతనం చెల్లిస్తున్నారు. ఒక్కొక్క కార్మికుని వద్దనుండి Rs.300 నుండి Rs.500 వరకు డబ్బును మినహాయించుకొని టేకేదారులు పేమెంట్ చేస్తున్నారు.ఇప్పటికే పని దినాలు తక్కువ రావడం. ఆకు తంబాకు సరిగా లేనప్పుడు బయట కొనుక్కొని వచ్చి బీడీలు తయారు చేయటం. సరైన సమయంలో డబ్బులు రాకపోవటం తదితర సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఈ పరిస్థితులలో అదనంగా ఈ కురుకురే బాధ్యతను బీడీ కార్మికులపై పెట్టటం చట్ట విరుద్ధం. కావున మా యందు దయతలసి ఈ కురుకురే ప్యాకెట్లు అమ్మకానికి సంబంధించి తగిన నిర్ణయం తీసుకొని బీడీ కార్మికులను ఆ బాధ్యత నుంచి తప్పించే విధంగా యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగా మోహన్ తదితరులు పాల్గొన్నారు.