నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రెండో జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్రకు 11వ భారత్ గౌరవ్ టూరిస్ట్ సదరన్ సర్క్యూట్ రైలు సికింద్రాబాద్ నుంచి మంగళవారం ప్రారంభమైనట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. తమిళనాడు, కేరళలోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాలను సందర్శించేందుకు ఈ యాత్ర ఉద్దేశించింది. ఈ యాత్రలో ప్రయాణికులకు తిరువణ్ణామలై (అరుణాచలం), రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరులను కవర్ చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఆపరేషన్ మేనేజర్ బి.నాగ్యా, ఐఆర్సీటీసీ గ్రూప్ జీఎం పి.రాజ్ కుమార్ తెలిపారు.