కుషాయిగూడలో అతిపెద్ద నేషనల్‌ మార్ట్‌ ఏర్పాటు

హైదరాబాద్‌ : నగర కేంద్రంగా పని చేస్తోన్న ‘నేషనల్‌ మార్ట్‌ – ఇండియా కా సూపర్‌ మార్కెట్‌,’ హైదరాబాద్‌లోని కుషాయిగూడ సమీపంలోని నాగారంలో అతిపెద్ద స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన దీనిని శుక్రవారం లాంచనంగా ప్రారంభించింది. ఇక్కడ వినియోగదారులు ఒకేచోట వారికి కావాల్సిన ప్రతీది సులభంగా షాపింగ్‌ చేయవచ్చని నేషనల్‌ మార్ట్‌ వ్యవస్థాపకుడు యశ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. తమ స్టోర్లలో 365 రోజుల పాటు ఆఫర్లను అందిస్తున్నామన్నారు. ఇది తమకు 6వ స్టోర్‌ అని తెలిపారు. ఈ ఏడాది మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మరికొన్ని చోట్ల కూడా కొత్త స్టోర్లను అందుబాటులోకి తేనున్నామన్నారు.