– ఒకే జాతి ఒకే జెండా ఉండాలన్నదే బీజేపీ లక్ష్యం..
నవతెలంగాణ మునుగోడు..
మతోన్మాద రాజకీయాలను పెంచి పోషిస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు చేసే ప్రయత్నాలను కార్మికులు కర్షకులు ఒకటై బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలోకొస్తే హక్కుల సాధన కోసం కొట్లాడి సాధించుకున్న హక్కులను కాల రాసేందుకు కుట్ర పన్నుతున్నా బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మండిపడ్డారు. బీజేపీకి దేశంలో ఒకే జెండా ఒకే మతం ఉండాలనే దురుద్దేశంతో ఉన్నాదని పేర్కొన్నారు. భూమికోసం భుక్తి కోసం వెట్టి సాకిరి విముక్తి కోసం తుపాకిని పట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి పోరాడిన వీర వనిత సాకలి ఐలమ్మ రెండవ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల మునుగోడు మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో ప్రాథమిక సభ్యత్వం నుండి తగ్గించడం జరిగిందని పార్టీ మండల కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం, మండల కార్యదర్శి మిర్యాల భరత్, సహాయ కార్యదర్శి వరికుప్పల మృత్యాలు, మండల కమిటీ సభ్యులు యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి, యాట యాదయ్య, సాగర్ల మల్లేష్, కొంక రాజయ్య, రాములు తదితరులు ఉన్నారు.