గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

నవతెలంగాణ-జవహర్‌ నగర్‌
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన జవహర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యాప్రాల్‌లోని కౌకూర్‌ దర్గా సమీపంలో చోటుచేసుకుంది. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం కౌకూర్‌ దర్గా సమీపంలో గుర్తు తెలియని మగ వ్యక్తిపడి ఉన్నట్టు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా వ్యక్తి అప్పటికే మృతి చెంది ఉన్నాడు. సుమారు అతని వయస్సు 45-50లోపు ఉంటుందని, నలుపు రంగు, తెల్లని గడ్డం, బట్టతల, ఛాతి ఎడమభాగంపై పుట్టమచ్చ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సమాచారం తెలిసిన వారు 8712662097, 8712662099, 8712662188 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.