– ఈ నెల 18న సీఎం సభను విజయవంతం చేయాలి
– జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ చర్ల కోల లక్ష్మారెడ్డి
మిడ్జిల్: జడ్చర్ల గడ్డమీద లక్ష మెజార్టీతో బీ ఆర్ ఎస్ పార్టీ జెండా ఎగురుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ చర్ల కోలా లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఎంవీఎస్ ఫంక్షన్ హాల్లో మండల అధ్యక్షులు పాండు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీ ఆర్ ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఐదు గ్యారంటీలు అమలు కావని, స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు నిండిన కాంగ్రెస్ పార్టీ 56 సంవత్సరాలు దేశాన్ని రాష్ట్రాలను పరిపాలించిన ఏ ఒక్క గ్రామం కూడా అభివద్ధి చేయలేదని , అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వేరే ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ బందు చేయిస్తారని తెలిపారు. ప్రపంచ దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాల కత్తితంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. దళితుల అభివద్ధి కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొస్తే దళిత బంధు ఆపాలని కాంగ్రెస్ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. అంతకుముందుకు మండల కేంద్రంలో బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బరిగల సుదర్శన్, పీఏసీిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రైతు సమన్యాయ సమితి మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, శ్యాంసుందర్ రెడ్డి, బాల్ రెడ్డి, బాలు, మాజీ జెడ్పీటీసీ భీమయ్య గౌడ్, జగన్ గౌడ్ ఎల్లయ్య యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు జంగారెడ్డి, సర్పంచ్లు నారాయణరెడ్డి, భాస్కర్ నాయక్, మధు కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నాయకులు నవీనాచారి, మంద భీమ్ రాజ్, బంగారు, లక్ష్మణ్ పవర్, విజరు నాయక్, శివ ప్రసాద్ బీరయ్య కాడయ్య వెంకటయ్య శ్రీనివాసులు మంగలి నరసింహ చంద్రశేఖర్ రాములు రాజు సురేష్ తదితరులు పాల్గొన్నారు.