కుల సంఘాలకు అండగా నిలిచింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే

– ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌
నవతెలంగాణ-హనుమకొండ
కులసంఘాలకు అండగా ఉన్న ఏకై ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌అన్నారు. హనుమకొండ పార్టీ కార్యా లయంలో నాయిబ్రాహ్మణ సేవా సంఘంముఖ్య కా ర్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌ భా స్కర్‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చీఫ్‌విప్‌ మాట్లాడుతూ నాయిబ్రాహ్మణులకు నగరం నడిబొడ్డున స్థలం కేటా యించడం హర్షనీయమన్నారు. ఆ స్థలాన్ని ఇంతకు ముందు వేరే వారికి కేటాయించడం జరిగిందని, కుల వృత్తుల వారికి తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ స్థలాలనుకేటాయిస్తుందని అందులో భాగంగా తెలం గాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా హనుమకొం డలో నాయిబ్రాహ్మణులకు స్థలంకేటాయించడం జరి గిందన్నారు. అన్నగా ఒక కొడుగ్గా మీలో ఒక కుటుం బ సభ్యుడిగా ఉంటానని అన్నారు. ఎటువంటి సమ స్యలనైనా పరిష్కరించడంలో ముందుంటానని ఈ సందర్భంగా తెలిపారు.అందరితో తట్టుకొని శక్తివం చన లేకుండా పాటుపడ తానని అన్నారు. నాయి బ్రాహ్మణులకు కార్పొరేటర్‌ ను కేటాయించడం జరిగిం దని, అందుకు వివిధ వ ర్గాల నుండి వ్యతిరేకత వ చ్చినా కూడా దాన్ని అధిగ మించానన్నారు. కష్టపడ్డ వారికి ఖచ్చితంగా సమూచితస్థానం కల్పిస్తానని అ న్నారు. భవనం నిర్మాణానికి కావాల్సిన నిధులను స మకూరుస్తానని అన్నారు.భవన నిర్మాణం అయిన త ర్వాత కూడా అనేక అభివృద్ధి,సంక్షేమ పథకాలతో పా టు కుటుంబంలో ఉన్న అన్ని వర్గాల వారికి నైపుణ్యా లతో కూడిన అభివృద్ధి పథకాలు ఏర్పాటు చేస్తామ ని వినయభాస్కర్‌ పేర్కొన్నారు.
శాసనమండలి సభ్యులు బస్వరాజ్‌ సారయ్య మాట్లాడుతూ మన కులస్తులు పనిచేస్తారు పని తీసు కుంటారన్నారు. హైదరాబాదులో ఉన్న కమ్యూనిటీ భవననిర్మాణ స్థలం కోసం, అదేవిధంగా హనుమ కొండలోని స్థలంకోసం సురేష్‌, రాములు ఎంతగానో కష్ట పడ్డారన్నారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కేసీఆర్‌ నాయకత్వంలో కుల సంఘాలకు కులవత్తులు చేసే వారికి అత్యంత గౌరవం లభించిందన్నారు. భవన ని ర్మాణాల కోసం నిధులను వెచ్చించి, అత్యధికంగా భవ నాలను నిర్మాణం చేపట్టాలని చెప్పారు. అందరూ ఐ క్యతతో పనిచేయాలని అన్నారు.ఈకార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రైతు రుణ వి మోచన కమిషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు సభా ధ్యక్షత వహించగా కార్పొరేటర్‌ ఎలకంటి రాములు, నెక్కొండ కవితా కిషన్‌,మైనారిటీ కమిషన్‌ సభ్యులు దర్శన్‌సింగ్‌, సంఘ నాయకులు సురేష్‌,ప్రభాకర్‌ తో పాటు తదితరులు పాల్గొన్నారు.