నవతెలంగాణ -నెల్లికుదురు
ప్రజలకు మోస మాటలు చెప్పి మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ ని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ మహబూబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి హుస్సేన్ నాయక్ అన్నారు. మండలంలోని రావిరాల రాజుల కొత్తపల్లి మునగలవీడు సోమవారం పర్యటించి పార్టీలో చేరిన వారికి కండువా కప్పి స్వాగతించారు కేసీఆర్ ఇన్ని రోజులు ప్రజలను మోసం చేశారని అన్నారు. తెలంగాణకు చేసిన అభివృద్ధి లేదని తెలిపారు. మోసపూరిత మాటలతో కాలయాపన చేశాడు తప్ప పేదల అభివృద్ధి కోసం పట్టించుకున్న పాపను పోలేదని ఆవేదన వ్యక్తం చెందారు. మహబూబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్న శంకర్ నాయక్ తన స్వార్థం కోసమే ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉన్నాడు తప్ప కనీసం నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి కోసం ఈనాడు కూడా పట్టించుకున్న పాపన్న పోలేదని అన్నారు. అందుకోసం వారిని తరిమికొట్టే రోజులు ఇప్పుడు ఉన్నాయని ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్ జిల్లా నాయకుడు నల్లని పాపారావు. సతీష్ కిరణ్ వాసు యాకి రెడ్డి ముస్తఫా తోపాటు నాయకులు పాల్గొన్నారు.