న్యూఢిల్లీ/వాషింగ్టన్ : 90 అడుగుల వెడల్పు కలిగిన ఓ ఆస్టరాయిడ్ (గ్రహశకలం) శనివారం భూమికి అతిచేరువగా రానుంది. గంటకు 29,961 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న 2024 %ఖA%1 పేరు కలిగిన అస్టరాయిడ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 16.36 గంటలకు భూమికి 18 లక్షల కి.మీ దూరంలో ప్రయాణించనున్నట్లు నాసా తెలిపింది. ఈ దూరం గణనీయంగా కనిపించనప్పటికీ.. ఖగోళపరంగా ఈ దూరం భూమికి చేరువగా వచ్చినట్లేనని నాసాకి చెందిన భూమికి సమీపంలో ఉన్న వస్తువుల అధ్యయన కేంద్రం (%జచీజుఉూ%) తెలిపింది. అపోలో వర్గానికి చెందిన ఈ ఆస్టరాయిడ్ భారీ పరిమాణంలో ఉన్నప్పటికీ.. భూమికి ఎటువంటి ముప్పు ఉండదని స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో మరికొన్ని ఆస్టరాయిడ్లు భూమికి సమీపంగా వెళ్లనున్నట్లు నాసా పేర్కొంది. 2024 %ఖA%1 తర్వాత సుమారు 84 అడుగుల పరిమాణం కలిగిన 2024 %ూజ% భూమికి సుమారు 4,703,168 కి.మీ దూరంలో ప్రయాణించ జూన్ 11న మరో రెండు ఆస్టరాయిడ్లు భూమికి చేరువగా రానున్నట్లు తెలిపింది.