ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్

నవతెలంగాణ కంఠేశ్వర్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు. బ్యాలెట్ యూనిట్ లు, కంట్రోల్ యూనిట్లు, వీ.వీ.ప్యాట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. వాటికి సంబంధించిన వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకుని, సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. ప్రస్తుతం జిల్లాకు వీ.వీ.ఫ్యాట్ లు, ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, కంట్రోల్ యూనిట్లు అన్నీ కూడా కొత్త వాటిని కేటాయించారని ఎన్నికల విభాగం అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.