కాంగ్రెస్ పార్టీ నా కన్నతల్లి వంటిది పార్టీని వీడే ప్రసక్తే లేదు

– చేతి గుర్తుకి ఓటు వేయమంటున్న మాజీ ఎమ్మెల్యే గంగారం
– కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే సౌదగార్ గంగారం
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్: మాండల కేంద్రంలో  బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ  జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదగర్ గంగారాం తన స్వగృహంలో జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయాల మేరకే తన నిర్ణయం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీని వీడనని వెల్లడించారు. రేపు మద్నూర్ లో రెండు సెట్ల నామినేషన్ లను వేస్తానని పార్టీ కార్యకర్తలు అభిమానులు దాదాపు ఐదు వేల మంది భారీ సంఖ్యలో కార్యకర్తలు కదిలి రావాలంటూ పిలుపునిచ్చారు. ఒకటి కాంగ్రెస్ రెబల్ గా, మరొకటి ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేస్తానంటూ కార్యకర్తలకు వెల్లడించారు. జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రేస్ పార్టీ నాయకుల సూచనల మేరకు నాడ్చుకుంటానని అదే విదంగా కాంగ్రేస్ పార్టీ తన కన్నా తల్లి లాంటిదని అన్నారు. దింతో తన అనుచరుల ఆలోచన మేరకు  నాడ్చుకుంటానని సమావేశంలో ప్రసంగిస్తూ అన్నారు.అంతే కాకుండా కొందరు నాయకులు ఢిల్లీలో ముంబయి లలో ఉంటారు గాని నేను జుక్కల ప్రజల సేవ కోరకు పెద్ద కొడపగల్ లోనే ఉంటానాని  తెలిపారు. జుక్కల్ ప్రజలే నాకు ఢిల్లీ అని కొనియాడారు. ప్రతి ఒక్క కార్యకర్తలు చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.