గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాల ప్రచారం

నవతెలంగాణ- రాజంపేట్
రాజంపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆరు పథకాల పత్రాలు బుధవారం గడపగడపకు పంపిణీ చేయడంతో పాటు ఆ పథకాల గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యాదవ రెడ్డి మాట్లాడుతూ. ఈ కార్యక్రమంకు ప్రజల నుండి భారీ స్పందన వచ్చిందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కే వీరన్న, కే బాలకిషన్,మండల యూత్ అధ్యక్షులు అంకం కృష్ణారావు, రాజంపేట పట్టణ అధ్యక్షులు రంగ గంగాధర్ గౌడ్, యూత్ అధ్యక్షులు మండల మైనార్టీ నాయకులు షాదుల్, చంద్రం, అప్సర అలీ, వజిత్ అలీ,మేకల నరసింహులు, పిట్ల సత్యం, ఎన్ ఎస్ యు ఐ మండల శాఖ అధ్యక్షులు షేక్ జమీల్, ఎస్సీ సెల్ నాయకులు భీమయ్య, భాగయ్య,తదితరులు పాల్గొన్నారు.