భిన్న కాన్సెప్ట్‌తో ది కానిస్టేబుల్‌

వరుణ్‌ సందేశ్‌ హీరోగా ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌కె దర్శకత్వంలో జాగతి మూవీ మేకర్స్‌ పతాకంపై బలగం జగదీష్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ది కానిస్టేబుల్‌’. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. బి.నిఖిత జగదీష్‌ కెమెరా ఆన్‌ చేయగా, బి జే రిథిక క్లాప్‌ కొట్టారు.
ఈ సందర్భంగా హీరో వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ, ‘ఈ తరహా చిత్రాన్ని గతంలో నేను ఎప్పుడూ చేయలేదు.. ఒక ఎమోషనల్‌ కానిస్టేబుల్‌ పాత్రలో నటిస్తున్నాను. దర్శకుడు చెప్పిన కథ, కథనం నన్నెంతో ఆకట్టు కున్నాయి. ఈ చిత్రంలో నటిస్తుండటం ఎంతో ఆనందం కలిగిస్తోంది’ అని అన్నారు. ‘ఇదొక సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌. ఈనెల 5 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’ అని దర్శకుడు ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌కె చెప్పారు.
‘ఓ మంచి కథతో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో కానిస్టేబుల్‌గా వరుణ్‌ సందేశ్‌ని కొత్తగా చూపించబోతున్నాం. ఈ సినిమా కచ్చితంగా అందర్నీ అలరిస్తుంది. ఈ చిత్రంలో నటించే మిగతా నటీనటుల ఎంపిక జరుగుతోంది’ అని నిర్మాత బలగం జగదీష్‌ తెలిపారు.దువ్వాసి మోహన్‌, సూర్య, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : హజరత్‌ షేక్‌ (వలి), సంగీతం :సుభాష్‌ ఆనంద్‌, మాటలు శ్రీనివాస్‌ తేజ, పాటలు: రామారావు, శ్రీనివాస్‌ తేజ. నిర్మాత: బలగం జగదీష్‌, కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం :ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌కె.