ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గొల్ల విద్యాసాగర్ యాదవ్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అతని నివాసానికి వెళ్లి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపీ వివేకానంద.. విద్యా సాగర్ కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉద్యమ సమయంలో ధర్నాలు, రాస్తారోకోలలో చురుకుగా పాల్గొని.. బీఆర్‌ఎస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించిన సాగర్ యాదవ్ మరణం పార్టీకి తీరనిలోటు అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎంసీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, సీనియర్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డి, సుధీర్ రెడ్డి కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు