నాన్‌టీచింగ్‌ సిబ్బంది డిమాండ్లను పరిష్కరించాలి

– అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో ఉద్యోగుల ప్రదర్శన, సభ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్‌టీచింగ్‌ సిబ్బంది డిమాండ్లను నెరవేర్చా లని తెలంగాణ యూనివర్సిటీస్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు జె.వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. ఇదే విషయంపై రాజేంద్రనగర్‌లోని ఆ యూని వర్సిటీ ప్రాంగణంలో నాన్‌టీచింగ్‌ సిబ్బంది ప్రదర్శన చేసి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ..నాన్‌టీచింగ్‌ సిబ్బందికి ఒక్కో వర్సిటీలో ఒక్కో విధంగా వేతనాలు చెల్లించడమేంటని ప్రశ్నించారు. అగ్రికల్చరల్‌ వర్సిటీలోని టైమ్‌ స్కేల్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలనీ, మిగతా సిబ్బందికి జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ కింద రూ.5 లక్షలు చెల్లించాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.