ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే రాష్ట్ర అభివృద్ధి

నవతెలంగాణ – నాంపల్లి: ముఖ్యమంత్రి సారథ్యంలో, మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సతీమణి కూసుకుంట్ల అరుణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలో బుధవారం ఆమె కోడలు స్రవంతి, కూతురు రమ్య లతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పనంగా పెట్టి కొట్లాడి సాధించిన తెలంగాణలో ముఖ్యమంత్రిగా  కెసిఆర్ ఉంటేనే పల్లెలన్నీ బాగుపడతాయని ఆమె అన్నారు.  మునుగోడు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడు ప్రాంతం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుందని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను గెలిపించుకుంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, నక్క రవీందర్, జిల్లా నాయకులు ఇట్టం వెంకటరెడ్డి, ఏడుదొడ్ల ప్రభాకర్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ నక్క శేఖర్, నాంపల్లి మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు కోరె ప్రమీల మురళి, పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కర్నే యాదయ్య, గౌరు కిరణ్, గంజి సంజీవ, కామిశెట్టి పాండు, పూల చక్రి, పంగ కొండయ్య, నాంపల్లి హన్మంతు, నాంపల్లి సంజీవ, గాదేపాక వేలాద్రి, నాంపల్లి సత్తయ్య, ఎదుళ్ల యాదగిరి, కర్నాటి మహాత్మ, పల్ల పర్వత రెడ్డి, కస్తూరీ రాము, జైపాల్ రెడ్డి, నెరల్ల సైదులు, వంగూరి శివ, ఉడుత బిక్షం తదితరులు పాల్గొన్నారు.