తెలంగాణ అమరుల కలలు కమ్యూనిస్టులతోనే సాధ్యం

– సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్‌
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
తెలంగాణ అమరుల కలలు కమ్యూనిస్టులతోనే సాధ్యమని సీపీఐ కుత్బుల్లాపూర్‌ నియోజక వర్గ కార్యదర్శి ఈ .ఉమా మహేష్‌ అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగద్గిరిగుట్ట సీపీఐ కార్యాలయంలో శాఖ కార్యదర్శి సహదేవ్‌ రెడ్డి అధ్యక్షత జాతీయ పతాకాన్ని ఆయనతోపాటు సీపీఐ సీనియర్‌ నాయకులు నారాయణలు ఎగరేశారు. ఈ సందర్భంగా ఈ .ఉమా మహేష్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కేవలం బీఆర్‌ఎస్‌ కాకుండ యావత్తు తెలంగాణ సమాజం పోరాడిందని.. కానీ నేడు కేవలం కేసీఆర్‌, కేటీఆర్‌లు బీఆర్‌ఎస్‌ లు పొరాడినందుకే వచ్చినట్లు వ్యవహరించడం తగదని ఇది హాస్యాస్పదమన్నారు. నాడు తెలంగాణ వ్యతిరేకులు నేడు తెలంగాణ క్యాబినెట్‌లో ఉండడం సిగ్గుగా ఉందని నేడు ప్రజలు తెలంగాణ కొంతమంది కి మాత్రమే వచ్చిందని బాధపడుతున్నారని అన్నారు. బీజేపీ ,ప్రధాని మోడీ తెలంగాణ ఏర్పాటునే అవమాన పరిచేలా నిండు పార్లిమెంట్‌ లో మాట్లాడటం మోడీకి తెలంగాణ పై ఉన్న ద్వేషం తెలియచేస్తుందని ఇక్కడి బీజేపీ నాయకులు ముందుగా మోడీ నుండి జవాబు తీసుకొని చెప్పాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత సీపీఐ గా తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారని వాటిని సీపీఐ గా అమలు కొరకు పోరాడేందుకు సిద్ధం అని అన్నారు. రాబోవు ఎన్నికల్లో కూడా సీపీఐ మెజారిటీ స్థానాల్లో పోటీచేసి బూర్జువా పార్టీలకు ప్రత్యామ్నాయం సీపీఐ అని భావించేలా పనిచేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఫ్‌ కార్యదర్శి వెంకటేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు అరవింద్‌,సీపీఐ నాయకులు రాజు, నగేష్‌ చారి, ఖయుమ్‌, మహబూబ్‌, నరేందర్‌,రాములు,శంకర్‌,మల్లేష్‌,ముసలయ్య,మోగిలెయ్య తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
కేపీహెచ్‌బీ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బాలాజీనగర్‌ పరిధిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కూకట్‌ పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు తో పాటు బాలాజీనగర్‌ కార్పొరేటర్‌ శిరీష బాబురావు లు పాల్గొని కె.పి.హెచ్‌.బి కాలనీ రోడ్‌ నెంబర్‌ 1, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్పొరేటర్‌ కార్యాలయం వద్ద, వివేక్‌ నగర్‌ వద్ద, బాలాజీనగర్‌ విజయదుర్గ సెంటర్‌ వద్ద , రాఘవేంద్ర కాలనీ లలో కార్పొరేటర్‌ పగుడాల శిరీష బాబురావు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం కార్పొరేటర్‌ మాట్లాడుతూ ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల స్ఫూర్తితో సాధించిన తెలంగాణలో స్వరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కషితో అభివద్ధి సంక్షేమం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ” అనే నినాదంతో పోరాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపిన ధీరుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షులు సిహెచ్‌ ప్రభాకర్‌ గౌడ్‌, డివిజన్‌ కార్యదర్శి వెంకటేష్‌ చౌదరి, ముఖ్యులు, సీనియర్‌ నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళామణులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
హైదర్నగర్‌ డివిజన్లో ….
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర అవతారణ దశాబ్ది ఉత్సవాలలో హైదర్‌ నగర్‌ డివిజన్‌ పరిధి సమతా నగర్‌ లోని కార్పొరేటర్‌ కార్యాలయంలో , హెచ్‌ఎంటీ శాతవాహన నగర్‌ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్‌ నార్నె శ్రీనివాస రావు పాల్గొని ఆయా ప్రాంతాలలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయా ంలో తెలంగాణ రాష్టం అభివద్ధి వైపు పరుగులు పెడుతున్నా మన్నారు. తెలంగాణ అభివద్ధికి బీఆర్‌ఎస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్‌ మెంబర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు, ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీ డివిజన్‌లో..
కూకట్‌ పల్లి నియోజకవర్గం పరిధిలోని కేపీహెచ్‌బీ డివిజన్‌ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నేపథ్యంలో కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు పాల్గొని 9 వ ఫేస్‌ లోని భారత రాష్ట్ర సమితి కార్యాలయం నందు జాతీయ జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్‌, పాతురు గోపి, రామారావు, వెంకటరెడ్డి రాంబాబు నాయుడు, గఫూర్‌ భారతి ,హేమ ,వెంకటలక్ష్మి ప్రభాకర్‌, పద్మ, లీల, రాము వెంకటరమణ, వెంకటేశ్వరరావు, ప్రతాప్‌ ప్రసాద్‌, కష్ణమూర్తి, భాస్కర్‌ నాయి, రాజా వెంకటరావు సుమతి, బేగం , మహిళలు పాల్గోన్నారు.
కూకట్‌ పల్లి జోనల్‌ కమిషనర్‌ కార్యాలయంలో
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కూకట్‌పల్లి జోనల్‌ కార్యాలయంలో కూకట్‌ పల్లి ఎమ్మెల్యే మాధవ రం కష్ణారావు. జొనల్‌ కమిషనర్‌ మమతలు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ సచివాలయంలో చేపట్టిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్ళారు. డీసీలు, ఎస్‌ఈలు, సీపీ ఈఈలు, ఏసీపీలు, ఏఎంఓహెచ్‌లు, ఇతర జీహెచ్‌ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.