తెలంగాణ సాధనలో కళాకారుల కృషి చాలా గొప్పది

 The efforts of artists in Telangana sadhan are very great– జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్‌ నాయక్‌, పీఏసీఎస్‌ చైర్మెన్‌ గంప వెంకటేష్‌ గుప్తా
– జర్పుల రాధాకష్ణ ట్రస్ట్‌, గంప లక్ష్మయ్య ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కళాకారులకు ప్రోత్సాహకాలు అందజేత
నవతెలంగాణ-ఆమనగల్‌
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల కషి మరువలేనిదని జిల్లా పరిషత్‌ గ్రామీణాభివద్ధి శాఖ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, కడ్తాల్‌ మండల జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్‌ నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌, ఆమనగల్‌ కడ్తాల్‌ మండలాల పీఏసీఎస్‌ చైర్మెన్‌ గంప వెంకటేష్‌ గుప్తా అన్నారు. కడ్తాల్‌ మండల కేంద్రంలో మంగళవారం జర్పుల రాధాకష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ దశరథ్‌ నాయక్‌ తన కుమారుని జ్ఞాపకార్థం స్థాపించిన జర్పుల రాధాకష్ణ మెమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా స్థానిక మహిళా కోలాట కళాకారులకు రూ.30 వేలు నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. అదేవిధంగా పీఏసీఎస్‌ చైర్మెన్‌ గంప వెంకటేష్‌ తన తండ్రి జ్ఞాపకార్థం స్థాపించిన గంప లక్ష్మయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా 30 మంది కోలాట మహిళా కళాకారులకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారులకు ఒక ప్రత్యేక స్థానం ఉందని గుర్తు చేశారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కంబాలపల్లి పరమేష్‌, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు జోగు వీరయ్య, ఎంపీటీసీ సభ్యులు లచ్ఛిరామ్‌ నాయక్‌, సర్పంచులు హంస మోత్య నాయక్‌, నాగమణి వెంకోబా, ఉపసర్పంచ్‌ రామకష్ణ, డైరెక్టర్లు సేవ్యా నాయక్‌, లాయఖ్‌ అలి, వెంకటయ్య, మంగళపల్లి నర్సింహ, బిక్షపతి, రామచంద్రయ్య, శ్రీను నాయక్‌, ప్రేమ్‌, రమేష్‌, హర్యా నాయక్‌, రాజు, లక్పతి నాయక్‌, రమేష్‌, మహేష్‌, పాండు, ప్రశాంత్‌, నరసింహ, సక్రు, టిక్‌ లాల్‌, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.