మాజీమంత్రి విజయ రామారావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ
నవతెలంగాణ-అడిక్మెట్
అమరవీరుల త్యాగాలు, ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను తాను ఒక్కడే తెచ్చాననడం ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఉద్యమ ద్రోహానికి నిదర్శనమని మాజీ మంత్రి ఉద్యమ నాయకుడు విజయరామారావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య లపై యావత్ ఉద్యమ నాయకుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఆధ్వర్యంలో విద్యానగర్ బీసీ భవ న్లో ఉద్యమ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నాటి ఉద్యమ నాయకులు, విద్యార్థి, న్యాయ వాద జేఏసీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ పాత్ర నామ మాత్రమేనని, ఎంతోమంది అమరవీరుల త్యా గాలు రైతుల విద్యార్థుల పోరాటాలు ఆత్మార్పణలతో సకల జనుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను తాను ఒక్కడే తెచ్చాను అనడం, తెలంగాణ చరిత్ర కూడా తాను ఒక్కడిదే అని చెప్పుకునే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2001 నుండి 2009 వరకు రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ అనే స్వప్రయోజక వైఖరిని అవలంబించి, తన రాజకీయ ఉన్నతికై ఉపయోగించుకున్నాడని దుయ్యబ ట్టా రు. వేలాదిమంది త్యాగాల త్యాగాన్ని, కొండా లక్ష్మణ్ బాపూ జీ,ప్రొఫెసర్ జయశంకర్ త్యాగాలను తన ఖాతాలో వేసు కొ నే దుర్మార్గపు ఆలోచనలను యావత్ తెలంగాణ సమాజం వివిధ వర్గాలుగా ముక్తకంఠంతో ఖండిస్తున్నాయన్నారు. సిఎం తాను చేసిన అహంకారపు వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకోకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హె చ్చరించారు. 24న ఏర్పాటు చేసిన సమావేశాన్ని విజయ వంతం చేయాలని విజ్ఞప్తి చేశా రు.ఈ సమావేశంలో ప్రము ఖ ఉద్యమకారులు మురళీధర్ దేశ్పాండే, కోలా జనార్ధన్, అడ్వకేట్ చేసిన నాయకులు శ్రీనివాస్ యాదవ్, నీల వెంకటేష్, వేముల రామకష్ణ, రామ్ రెడ్డి, జేఏసీ ఓయూ జై శివ శంకర్, మోడీ రాందేవ్, తదితరులు పాల్గొన్నారు.