బాక్సులో భవితవ్యం.. ఫలితాలపై ఉత్కంఠ..

– గెలుపు కోసం పార్టీల ఎదురుచూపులు…
– మార్పు కోరిన ఓటర్లు…
– పోలింగ్ లో కనిపించిన ప్రభుత్వ వ్యతిరేకత..
– వ్యతిరేక ఓటు చీలకపోతే కాంగ్రెస్కే లాభం..
– మంత్రికి తప్పని ఎదురుగాలి..
– ముచ్చెమటలు పట్టించిన యువత, నిరుద్యోగులు, కార్మికులు
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ప్రభుత్వ వ్యతిరేకత ఒక వైపు అభ్యర్థుల నియంత పాలన మరోవైపు జిల్లా ప్రజలను ప్రభావితం చేసింది. అధికార పార్టీ నాయకులు ఎంత ప్రచారం చేసినా… ప్రజల చెవికి ఎక్కలేదు. మంత్రులు ఎమ్మెల్యేలకు సైతం ఎదురుగాలి తప్పడం లేదు. ముఖ్యంగా యువత, నిరుద్యూగోలు అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించారు.సుమారు 40 రోజులుగా అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రచారం ఎవరిని ఒడ్డుకు చేర్చుతుందో వేచిచూడాలి. నవంబర్ 30న జరిగిన పోలింగ్ కాంగ్రెస్ గాలి వీస్తోందని అనేక సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ బాగా పుంజుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నాయకుల దూకుడును జిల్లా ఓటర్లు అంగీకరించలేదు. ఉమ్మడి జిల్లాలో 13నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో రెండు నియోజకవర్గాలైన సిరిసిల్ల, వేములవాడ. సిరిసిల్ల నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి అయిన మంత్రి కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఆయన మంత్రి కేటీఆర్ కు కూడా వ్యతిరేక పవనాలు తప్పలేదు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు మంత్రి కేటీఆర్ నమ్మిన బంట్లు, ప్రధాన నాయకుల తీరు బాగా లేదనే చర్చ ఉంది. వారి వ్యవహార తీరు పట్ల సొంత పార్టీ కార్యకర్తలే విసుక్కుంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఆగడాలను నిలువరించడానికి ప్రయత్నం చేస్తే… దాడులు సైతం చేశారు. దీంతో అక్కడ అధికార పార్టీకి వ్యతికేక వాతావరణం నెలకొంది. ఇక వేములవాడ నియోజకవర్గంలో పలుసార్లు పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కు సానుబూతి ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థికి, బిజెపి అభ్యర్థికి రాజకీయఅనుభవాలు లేవు. టిఆర్ఎస్ అభ్యర్థికి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ టికెట్ ను అందించి నిలబెట్టాడు. అంతేకాకుండా వేములవాడ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిగా మాజీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మహారాష్ట్ర అమ్మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారునికి బిజెపి అధిష్టానం నుండి టికెట్ తెచ్చుకొని నిలబెట్టాడు. గతంలో బిజెపి పార్టీ ఈ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు అంటూ వ్యతిరేక వాతావరణం నెలకొంది. దీనికి తోడు అక్కడ అధికార పార్టీకి వ్యతిరేక వాతావరణం ఉంది.దీంతో గురువారం జరిగిన ఎన్నికల్లో అధికశాతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో సిరిసిల్ల నియోజకవర్గం ముఖ్యమైనది. రాష్ట్ర మొత్తం ఈ నియోజకవర్గ వైపే చూస్తుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి సిరిసిల్ల అభివృద్ధి పథంలో నింపిన కానీ మంత్రి కేటీఆర్ కు వ్యతిరేక వాతావరణమే ఈ నియోజకవర్గంలో నెలకొంది.
     ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ప్రజలు అసంపూర్తిగా ఉన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంలో మంత్రి కేటీఆర్ విఫలమయ్యాడని, కేవలం నలుగురు వ్యక్తులను నమ్ముకొని నియోజకవర్గాన్ని అప్పజెప్పారని విమర్శలు కేటీఆర్ పై వెల్లువెత్తుతున్నాయి. అందుకే మంత్రి కేటీఆర్ పై వ్యతిరేకత ఉంది.ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా. ఆయా మండలాల్లో అధికార పార్టీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలు, భూకబ్జాలు వారిని వెంటాడుతున్నాయి. దీంతో మొన్న జరిగిన పోలింగ్ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోలింగ్ అయ్యిందన్న ప్రచారం ఉంది. అయినా ఓటర్లు మంత్రి కేటీఆర్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థికి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది. అయినప్పటికిని ఎన్నికల సమయంలో ముఖ్య నాయకులు కొందరు టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది. విస్తృత ప్రచారాలు, ఇంటింటా ప్రచారం చేయడమే కాకుండా ప్రభుత్వ పై ఉన్న విమర్శలు కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి సానుకూలత లభించింది. నియోజకవర్గాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయి. ఓటింగ్ సరళిని చూస్తే.. బీఆర్ఎస్ ను సిరిసిల్ల వేములవాడ నియోజక వర్గాల్లో మట్టి కరిపించారని తెలుస్తోంది. కానీ ఒకరిని మించి ఒకరు ప్రచారాలు ఎత్తుగడలు వేయడం తో గట్టి పోటీ నెలకొంది. ఎవరు గెలిచినా తక్కువ ఓట్లతో బయటపడతారు అనే వాదనలు ఈ రెండు నియోజకవర్గాల్లో వినిపిస్తున్నాయి.  బీఆర్ఎస్కు అనుకూల వాతావరణం నెలకొంది. గురువారం జరిగిన ఓటింగ్ సరిళి పరిశీలిస్తే.. బీఆర్ఎస్కు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.
చెమటలు పట్టించిన యువత…
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యువత పలు పార్టీలకు చెమటలు పట్టించింది. టిఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాల పాటు పరిపాలించిన యువకులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని ఆరోపణలతో యువత బిఆర్ఎస్ కాకుండా ఇతర పార్టీల వైపు మొగ్గు చూపాయి. ఉద్యోగులు సైతం తమకు రావలసిన జీతాలు సరిగా రావడం లేదంటూ, ఇంక్రిమెంట్లు సరైన సమయానికి ఇవ్వడం లేదని, ఉద్యోగ భద్రత కల్పించడం లేదని, ప్రమోషన్లు, టి ఏ లు, డిఏలు ఇలా వారికి రావలసిన సౌకర్యాలు ఏవి తెలంగాణ ప్రభుత్వం కల్పించలేదనే భావనతో ఉద్యోగులు ఇతర పార్టీల వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. బీడీ కార్మికులకు 2018 ఎన్నికల్లో పిఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలకు పెన్షన్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చి ఐదేళ్లు గడిచిన ఇప్పటివరకు ఏ ఒక్క బీడీ కార్మికులకు నూతన పెన్షన్ మంజూరు చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. కార్మికులు కూడా ఈసారి ప్రత్యామ్నాయం కోరుకున్నట్లు తెలుస్తోంది.