
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా ప్రభుత్వం అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి డి కిరణ్ అన్నారు. శుక్రవారం మండలంలోని పసర గ్రామంలో ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా కమిటీ సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు గూగులోత్ రమేశ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం పకడ్బందీగా అమలు చేయాలనీ ప్రైవేట్ విద్యా సంస్థల లో ఇష్టానుసారంగా ఫీజుల దోపిడీ చేస్తూ విద్యార్థులకు చదువుని అమ్ముకుంటూ వారికి చదువుదూరం అయ్యేలా కార్పొరేట్ శక్తులు వ్యవహరిస్తున్నాయి అని అన్నారు. విద్యార్థులు చదువుకోలేకపోతున్నారని ప్రవేట్ పాఠశాలలో మరియు కళాశాలలో ఇష్టం వచ్చిన రీతిలో ఫీజుల దోపిడీ చేస్తున్నారని ట్యూషన్ ఫీజులు పేరిట వేలాది రూపాయలు దండుకుంటున్నారని దీని నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు అధిక ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వ అధికార యంత్రాంగం పట్టించుకోకుండా కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ విద్యను నీరుగారుస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొందని ఇకనైనా ప్రభుత్వాధికారులు స్పందించి ఫీజులు కోసం నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని లేకపోతే జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి టి, ఎల్ రవి, జిల్లా నాయకులు ముషారఫ్, సిదు, జీవన్, గణేష్, పానీ, రాకేష్, పవన్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.