– కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ సెటైర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ పాలిత కర్నాటకలో అధికారులు కరెంటు ఇవ్వడం లేదని రైతులు కొంత మంది మొసలిని తీసుకొచ్చి సబ్ స్టేషన్‌లో వదలారా? అన్న వైరల్ వీడియోను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో అంటూ సెటైర్ వేశారు. దీనిపౖెె నెటిజన్లు స్పందించారు. ఇలాంటి పండుగలను కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలకే పరిమితం చేద్దాం. దిక్కుమాలిన పండుగలను తెలంగాణకు తీసుకురావద్దంటూ ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. మరో నెటిజన్, కరెంటు లేక జిరాక్స్ సెంటర్ దగ్గర రెండు గంటల నిలబడిన రోజులు మళ్లీ వస్తాయేమో అంటూ కామెంట్ పెట్టాడు. మరొకరు కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కటిక చీకట్లే అని కామెంట్ పెట్టారు.