త్యాగధనులతోనే స్వాతంత్య్ర ఫలాలు

– ఎస్‌బిఐలో జాతీయ జెండావిష్కరణ
హైదరాబాద్‌ : నగరంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) లోకల్‌ హెడ్‌ ఆఫీస్‌లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రాజేష్‌ కుమార్‌ జాతీయ జెండావిష్కరణ చేశారు. దేశ నిర్మాణంలో, ప్రజలకు సేవల చేయడంలో బ్యాంక్‌ ఉద్యోగుల పాత్ర కూడా కీలకంగా ఉందని రాజేష్‌ కుమార్‌ అన్నారు. అనేక మంది త్యాగలతోనే స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో నేడు భారత్‌ కూడా ఒక అగ్రగామిగా ఉందన్నారు. పేదలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు సేవలందించడంలో ఎస్‌బిఐ కీలక పాత్ర పోశిస్తుందన్నారు. జెండావిష్కరణ కార్యక్రమంలో ఎస్‌బిఐ జనరల్‌ మేనేజర్‌ ఎన్‌డబ్ల్యు-2 దేబాశిష్‌ మిత్రా, ఇతర ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.